ఆశీర్వదించండి అందుబాటులో ఉంటా…

ఆశీర్వదించండి అందుబాటులో ఉంటా…
క్యాతన్ పల్లి, ఆంధ్రప్రభ : క్యాతన్ పల్లి మున్సిపల్ పరిధిలోని 2వ వార్డులో బిజెపి అభ్యర్థి మోసం అనూష శ్యామ్ రాజ్ సోమవారం ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇంటింటికి తనను ఆశీర్వదించాలని కోరారు. ప్రజల సహకారంతో 2వ వార్డును ఆదర్శ వార్డుగా తీర్చిదిద్దుతామని తనను ఒక్కసారి కౌన్సిలర్ గా గెలిపించాలని కోరుతూ ప్రచారం విస్తృతంగా నిర్వహిస్తున్నారు.
పూర్తిస్థాయిలో సీసీ రోడ్ల నిర్మాణం, డ్రైనేజీల ఏర్పాటు, విద్యుత్ స్తంభాలు, వీధి దీపాలు, పారిశుధ్య నిర్వహణ సమస్యలకు శాశ్వత పరిష్కారంమౌలిక సదుపాయాలు అన్నిటిని కల్పించి ఆదర్శవాడిగా తీర్చిదిద్దామని హామీ ఇస్తున్నారు. ఎల్లుండి జరగబోయే ఎన్నికల్లో కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి తనను అత్యధిక మెజార్టీ తో కౌన్సిలర్ గా గెలిపించాలని అభ్యర్థి మోసం అనూష శ్యామ్ రాజ్ ఓటర్లకు విజ్ఞప్తి చేస్తున్నారు.
