2 CHILD | మెగా ఇంట‌ క‌వ‌ల‌ల సంద‌డి

2 CHILD | మెగా ఇంట‌ క‌వ‌ల‌ల సంద‌డి

  • బాబుకి, పాపకి జన్మనిచ్చిన ఉపాసన
  • ఆనందంలో అభిమానులు

2 CHILD | వెబ్ డెస్క్‌, ఆంధ్ర‌ప్ర‌భ : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇంట్లో పండగ వాతావరణం నెలకొంది. మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్, ఉపాసన దంపతుల ఇంట్లో సంబరాలు అంబరాన్నంటాయి. జనవరి 31, శుక్రవారం రాత్రి ఉపాసన కవల పిల్లలకు (ఒక బాబు, ఒక పాప) జన్మనిచ్చారు. ఈ సంతోషకరమైన వార్తను మెగాస్టార్ చిరంజీవి స్వయంగా సోషల్ మీడియా ద్వారా ప్రకటిస్తూ తన ఆనందాన్ని పంచుకున్నారు. తల్లి, చిన్నారులు ఇద్దరూ క్షేమంగా ఉన్నారని ఆయన వెల్లడించారు. మెగా వారసురాలు క్లింకార తర్వాత, ఈ దంపతులు ఇప్పుడు కవల పిల్లలకు తల్లిదండ్రులయ్యారు.

ఉపాసన కొణిదెల ఒక బాబుకి, ఒక పాపకి జన్మనిచ్చినట్లు మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియా వేదికగా అధికారికంగా ప్రకటించారు. తల్లీ, పిల్లలు క్షేమంగా ఉన్నారని.. తమ కుటుంబం ఇప్పుడు మరింత పరిపూర్ణమైందని చిరంజీవి తన సంతోషాన్ని పంచుకున్నారు. ఈ వార్త తెలియగానే సోషల్ మీడియాలో మెగా అభిమానుల హడావిడి మొదలైపోయింది. ఇప్పటికే క్లింకార రాకతో వెలిగిపోయిన మెగా సామ్రాజ్యం, ఇప్పుడు ఈ ‘ట్విన్’ సెలబ్రేషన్స్‌తో మరింత సందడిగా మారింది. దేశవ్యాప్తంగా సినీ ప్రముఖులు, అభిమానులు ఈ మెగా దంపతులకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

Leave a Reply