మాజీ కౌన్సిలర్ వెంకన్నను… ఓటు అభ్యర్థిస్తున్న కాంగ్రెస్ కౌన్సిలర్ అభ్యర్థి వెంకన్న

మాజీ కౌన్సిలర్ వెంకన్నను… ఓటు అభ్యర్థిస్తున్న కాంగ్రెస్ కౌన్సిలర్ అభ్యర్థి వెంకన్న
1 వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి పల్లెర్ల వెంకన్న
మోత్కూర్, ఫిబ్రవరి 8( ఆంధ్రప్రభ) : మోత్కూరు మున్సిపాలిలో 1 వ వార్డు తాజా మాజీ కౌన్సిలర్ పురుగుల వెంకన్నను… ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి పల్లెర్ల వెంకన్న ఆదివారం ఇంటింటి ప్రచారంలో భాగంగా మాజీ కౌన్సిలర్ ని స్వయంగా కలిసి ఓటు అభ్యర్థించారు. 1 వ వార్డులో ఇంటింటికి విస్తృత ప్రచారం నిర్వహిస్తున్న వెంకన్న.. వార్డు అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తానని …ఫిబ్రవరి 11న జరిగే మున్సిపల్ ఎన్నికల్లో చేయి గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని విన్నవిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన వెంట పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు గుండగోని రామచంద్రు , కాంగ్రెస్ నాయకులు బయ్యని రాజు, బొల్లెపల్లి సీతయ్య ,పంగ యాదగిరి తదితరులు పాల్గొన్నారు.
