19yrsBoy | లఖనవూలో తండ్రిపై కుమారుడి దారుణం.. ఆపై మిస్సింగ్ డ్రామా

19yrsBoy | కొడుకు డాక్టర్ కావాలనుకోవడమే ఆ తండ్రి తప్పా?

19yrsBoy | మిస్సింగ్ కేసుతో పోలీసులను తప్పు దారి పట్టించాలని ప్రయత్నించిన కుమారుడు
డీసీపీ విక్రాంత్ వీర్ వెల్లడించిన భయంకర నిజాలు

పున్నామ నరకం నుంచి తప్పించేవాడు పుత్రుడంటారు. నరకం పేరేదైనా ఆ పుత్రుడు తన తండ్రిని నరకం నుంచి తప్పించడానికి బదులు పంపించాడు. సభ్య సమాజం సిగ్గుపడేలా..మానవ సంబంధాలు విస్తుపోయేలా ఉన్న ఈ సంఘటన వివరాలిలా ఉన్నాయి.

లఖనవూలో ఒక పంతొమ్మిదేళ్ళ యువకుడు తన తండ్రిని తుపాకీతో కాల్చి చంపాడు. అంతటితో ఆగకుండా తెల్లవారి తానే స్వయంగా పోలీస్ స్టేషనుకు వెళ్లి తన తండ్రి కనిపించటం లేదని కేసు ఫిర్యాదు చేశాడు. వివరాల్లోకి వెళితే ఈ హత్యోదంతంపై పోలీసుల కథనం ప్రకారం…..

యాభై ఏళ్ళ మానవేంద్ర సింగ్ అనే వ్యక్తికి లఖన్ వూ సిటీలో అనేక వ్యాపారాలు ఉన్నాయి. అందులో పాథాలజీ ల్యాబులు, మద్యం దుకాణం ఇలా అనేకం ఉన్నాయి.

మానవేంద్ర సింగ్ భార్య కొన్నేళ్ళ క్రితమే మరణించారు. తన కుమారుడు బాగా చదువుకుని డాక్టరు కావాలన్నది మానవేంద్ర సింగ్ ఆశ. అతడి ఆశకు తగినట్లుగానే కొడుకు అక్షత్ ప్రతాప్ఇం టర్ లో బైపీసీ తీసుకుని బాగా చదువుకుని మంచి మార్కులు తెచ్చుకొన్నాడు. అతడు ప్రస్తుతం డిగ్రీ చదువుతున్నాడు.

నీట్ పరీక్ష రాయాలని తండ్రి అక్షత్ ప్రతాప్ పై ఒత్తిడి తెస్తూండేవాడు. కానీ కొడుకు ఆలోచనలు వేరే విధంగా ఉండేవి. కష్టపడి చదువుకోకుండా తండ్రి చేతిలో ఉన్న వ్యాపారాలు చూసుకుంటే చాలని అక్షత్ ప్రతాప్ ఆలోచన. ఇదే విషయమీ తరచు తండ్రీ కొడుకుల మధ్య ఘర్షణలు జరుగుచుండేవి. ఇదే క్రమంలో ఫిబ్రవరి 20వ తారీఖున తండ్రీ కొడుకులిద్దరి మధ్య వాగ్వాదం తీవ్రమైంది. ఆ కోపంలో కొడుకు అక్షత్ తమ ఇంట్లోని లైసెన్స్డ్ తుపాకీ తీసుకొచ్చి, దానితో తండ్రి మానవేంద్ర సింగ్ ను కాల్చి చంపాడు. ఆ పేలుడు శబ్దానికి పక్క గదిలోంచి పరుగు పరుగున వచ్చిన ఆ యువకుడి చెల్లెలు, మానవేంద్ర సింగ్ కూతురు ఈ దృశ్యాన్ని చూసి విస్తుపోయింది.

19yrsBoy
19yrsBoy

అయితే అక్షత్ ప్రతాప్ చెల్లెలితో, ఈ విషయం బయట ఎవరితోనైనా చెబితే అంతు చూస్తానని బెదిరించి చెల్లెలి నోరు మూయించాడు. ఆ తర్వాత తండ్రి మృతదేహాన్ని తాము నివాసం ఉంటున్న మూడో అంతస్తు నుంచి కిందికి తీసుకువచ్చి, ఒక రంపం తీసుకుని దానితో మృతదేహాన్ని ముక్కలుగా కోసాడు. ఆ ముక్కలను ఒక డ్రమ్ములో కుక్కాడు. కొన్ని శరీర భాగాలను కారులో తీసుకెళ్ళి, మారు మూల ప్రాంతంలో విసిరి పారేశాడు.

మర్నాడు తానే స్వయంగా పోలీసుల వద్దకు వెళ్లి.. దిల్లీకి వెళ్లిన తన తండ్రి కనిపించడం లేదని ఏమైపోయాడో తెలియడం లేదని అమాయకంగా నమ్మబలికాడు., పైగా తండ్రి ఫోను కూడా స్విచ్చాఫ్ వస్తోందని మిస్సింగ్ కేసు పెట్టాడు. కాగా స్థానికులు కొందరి ద్వారా అందిన సమాచారం మేరకు పోలీసులు మానవేంద్ర ఇంటిని తనిఖీ చేయగా.. కొడుకు చేసిన అఘాయిత్యం మొత్తం బయటపడింది. కారులో తీసుకెళ్ళి పారేయగా డ్రమ్ములో మిగిలిన మానవేంద్ర సింగ్ శరీర భాగాలను స్వాధీనం చేసుకుని ఈ అఘాయిత్యానికి ఒడిగట్టిన అక్షత్ ని అరెస్ట్ చేసినట్టు డీసీపీ విక్రాంత్ వీర్ తెలిపారు.

-ఆంధ్రప్రభ వెబ్

Leave a Reply