ఘనంగా మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు

ఘనంగా మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు
బాసర (నిర్మల్ జిల్లా) ఆంధ్రప్రభ : ఆర్జీయూకేటీ బాసర ప్రాంగణంలో ఎస్సీ, ఎస్టీ సెల్ ఆధ్వర్యంలో శనివారం మహాత్మా జ్యోతిరావు పూలే 199వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా వీసీ ప్రొఫెసర్ ఎ.గోవర్ధన్, డీన్ డా.విట్టల్, అధ్యాపక, అధ్యాపకేతర పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
అణగారిన వర్గాల అభ్యున్నతి, అంటరానితనం నిర్మూలన, మహిళా సాధికారత కోసం పూలే చేసిన విశేష కృషిని వీసీ, డీన్ కొనియాడారు. అందరికీ విద్య అందాలన్న పూలే ఆశయ సాధన దిశగా అడుగులు వేయాలని, ఆయన జీవితాన్ని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని వక్తలు సూచించారు. కార్యక్రమంలో సిబ్బంది పాల్గొన్నారు.
