టెన్త్ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి..

టెన్త్ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి..

పరీక్షలు రాయనున్న 550 మంది విద్యార్థులు..

జన్నారం, ఆంధ్రప్రభ : మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలో ఈనెల 14 నుంచి జరుగునున్న టెన్త్ పబ్లిక్ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు స్థానిక ఎంఈఓ ఎన్. విజయకుమార్ బుధవారం మధ్యాహ్నం తెలిపారు.ఈ సంవత్సరం మండలంలోని పదవ తరగతి 550 మంది విద్యార్థులు టెన్త్ పరీక్షలు రాయనున్నట్లు ఆయన చెప్పారు. మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో ఏర్పాటుచేసిన పదో తరగతి పరీక్ష కేంద్రంలో 191 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నట్లు ఆయన తెలిపారు.

ఈ సెంటర్ కు చీఫ్ సూపర్డెంటుగా డి. చిన్నయ్య,డిపార్ట్మెంటల్ ఆఫీసరుగా జి.ఓంప్రకాష్ వ్యవహరిస్తారని ఆయన చెప్పారు. మండల కేంద్రంలోని బాలికల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 200 మంది విద్యార్థులు పరీక్ష రాయనుండగా,చీఫ్ సూపర్డెంటుగా గొల్ల రామన్న, డిపార్ట్మెంటల్ ఆఫీసరుగా ఆర్.తులసిపతి, స్థానిక లిటిల్ హాన్స్ ఉన్నత పాఠశాలలో 260 పరీక్షలు రాయనుండగా, చీప్ సూపర్డెంటుగా బి. చిన్ననర్సయ్య, డిపార్ట్మెంటల్ అధికారిగా ఎ.నరేందర్ లను నియమించినట్లు ఆయన తెలిపారు.ఈ మూడు పరీక్ష కేంద్రాలలో 30 మంది ఇన్విజిలేటర్లను నియమించినట్లు, పరీక్షల కేంద్రాల వద్ద తగునీటి సౌకర్యంతో పాటు వైద్య సౌకర్యం ఏర్పాటు చేసినట్లు ఆయన వివరించారు.

Leave a Reply