17years jail| ఇమ్రాన్ ఖాన్ దంపతులకు

17years jail| ఇమ్రాన్ ఖాన్ దంపతులకు
17years jail| ఇస్లామాబాద్, ఆంధ్రప్రభ : పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ (Imran Khan), ఆయన భార్య బుష్రా బీబీకి తోషాఖానా-2 అవినీతి కేసులో ప్రత్యేక కోర్టు 17 ఏళ్ల జైలు శిక్ష విధించింది. ఫెడరల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (FIA) ప్రత్యేక కోర్టు జడ్జి షారూక్ అర్జుమంద్ ఈ తీర్పు వెల్లడించారు. 2021లో సౌదీ ప్రభుత్వం ఇచ్చిన కానుకలను ఇమ్రాన్ ఖాన్, బుష్రా బీబీ (Bushra Bibi) అక్రమంగా వినియోగించుకున్నారనే ఆరోపణలపై ఈ కేసు నమోదైంది.
17years jail | ఇద్దరినీ దోషులుగా తేల్చిన కోర్టు

ఇమ్రాన్ ఖాన్ (Imran Khan) ప్రధానిగా ఉన్న సమయంలో తోషాఖానా (Toshakhana) నిబంధనలను ఉల్లంఘించి కానుకలను ఇమ్రాన్, ఆయన భార్య బుష్రా అక్రమంగా వాడుకున్నట్లు ఆరోపణలున్నాయి. ఈ కేసులో ఇద్దరినీ దోషులుగా తేల్చిన కోర్టు కఠిన శిక్ష విధించింది. ఇమ్రాన్ ఖాన్ ఇప్పటికే అనేక కేసుల్లో జైలు శిక్ష అనుభవిస్తున్నారు. ఈ తాజా తీర్పుతో ఆయనపై రాజకీయంగా మరింత ఒత్తిడి పెరిగింది. కేసు వివరాలపై ఇరువురు నిందితులు అప్పీల్ చేయనున్నట్లు సమాచారం.
