160 గంజాయి మొక్క‌ల స్వాదీనం

160 గంజాయి మొక్క‌ల స్వాదీనం

ఉమ్మడి ఆదిలాబాద్, ఆంధ్రప్రభ : వ్యవసాయ పంట క్షేత్రంలో గుట్టుచప్పుడు కాకుండా గంజాయి(Marijuana) సాగు చేస్తున్న పంట క్షేత్రాలపై ఆదిలాబాద్ పోలీసులు(Adilabad Police) ఆకస్మికంగా దాడులు నిర్వహించారు. రూ. 16 లక్షల విలువైన 160 గంజాయి మొక్కలను ఆదిలాబాద్ రూరల్ పోలీసులు స్వాధీనపరుచుకున్నారు. డీఎస్పీ ఎల్ జీవన్ రెడ్డి(DSP L Jeevan Reddy) మాట్లాడుతూ.. ఆదిలాబాద్ రూరల్ మండలం అసోడ గ్రామ శివారులో ఓ రైతు పంట క్షేత్రాల నడుమ ఎవరికి తెలియకుండా గంజాయి సాగు చేస్తున్నట్టు సమాచారం అందిందని తెలిపారు.

ఈ రోజు ఎస్పీ అఖిల్(SP Akhil) మహాజన్ ఆదేశాల మేరకు పంట చేనులో సోదాలు నిర్వహించగా మెస్రం భుజంగరావు అనే రైతు కంది పంట క్షేత్రంలో 160 గంజాయి మొక్కలు లభ్యమయ్యాయని, వీటి విలువ మార్కెట్లో(market) రూ.16 లక్షలు ఉంటుందన్నారు. నిందితుడు భుజంగరావును అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించామన్నారు. అలాగే గంజాయి సాగు చేసే వారిపై కఠినంగా చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని హెచ్చ‌రించారు. ఈ ఆపరేషన్లో కీలకంగా వ్యవహరించిన రూరల్ సీఐ కే. ఫణి ధర్(CI K. Phani Dhar), ఎస్సై వీ .విష్ణు వర్ధన్, కానిస్టేబుల్ మంగల్ సింగ్, విఠల్‌ను డీ.ఎస్.పీ జీవన్ రెడ్డి అభినందించారు.

Leave a Reply