15 days | బాల్క సుమన్‌కు ఘ‌న స్వాగతం….

15 days | బాల్క సుమన్‌కు ఘ‌న స్వాగతం….

15 days | ఉట్నూర్, ఆంధ్రప్రభ : ఖానాపూర్ నియోజకవర్గ ఇన్చార్జ్ భూక్యా జాన్సన్ నాయక్, బి ఆర్ ఎస్ వి రాష్ట్ర అధ్యక్షులు గెల్లు శ్రీనివాస్ యాదవ్ ఆదేశాల మేరకు ఆదిలాబాద్ జైలు నుండి బుధవారం విడుదలైన చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ ను బీఆర్ఎస్వి ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు ధరణి రాజేష్ మర్యాద పూర్వకంగా కలిసి శాలువాతో ఘనంగా సత్కరించి పుష్పగుచ్చం అందజేసి స్వాగతం పలికారు.

ఈ సందర్భంగా ధరణి రాజేష్ మాట్లాడుతూ… క్యాతన్ పల్లి మున్సిపాలిటీ ఎన్నికల నేపథ్యంలో సుమన్ గారిపై కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమ కేసులు నమోదు చేసి 15 రోజుల పాటు రిమాండ్ చేసి జైలులో ఉంచడం తీవ్ర అన్యాయమని పేర్కొన్నారు. జైలులో సరైన వసతులు కల్పించకుండా, దోమలు తిరిగే ప్రాంతంలో పడుకోబెట్టి ఎన్నో ఇబ్బందులకు గురి చేసినట్లు విమర్శించారు. సుమన్ కు జైలు జీవితం కొత్త కాదని, విద్యార్థి దశలోనే ఎన్నోసార్లు జైలుకెళ్లి తెలంగాణ ఉద్యమంలో తనదైన శైలిలో పోరాటానికి ఊపిరి పోశారని గుర్తుచేశారు. “ఇలాంటి కేసులు ఎన్ని పెట్టినా, కాంగ్రెస్ ప్రభుత్వ అక్రమాలపై ప్రశ్నిస్తూనే ఉంటామని పేర్కొన్నారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం కొనసాగుతూనే ఉంటుంది అని ధరణి రాజేష్ స్పష్టం చేశారు.

Leave a Reply