14వ వార్డు ప్రజలు అందుబాటులో ఉండే వారిని గెలిపించాలి

14వ వార్డు ప్రజలు అందుబాటులో ఉండే వారిని గెలిపించాలి

ధర్మపురి, ఆంధ్రప్రభ : మున్సిపల్ 14వ వార్డు ప్రజలు ప్రతి నిత్యం అందుబాటులో ఉండే వారిని గెలిపించాలని తాను ప్రతి నిత్యం ప్రజలకు అందుబాటులో వుంటాని ప్రజలు ఒకసారి ఆశీర్వదించి భారీ మెజారిటీతో గెలిపించాలని 14వ వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వేముల రమాదేవి ఓటర్లను కోరారు. అదివారం వార్డు ప్రజలతో ఇంటింటా తిరుగుతూ చేతి గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థించారు. వార్డులో మౌలిక సదుపాయాలు కల్పిస్తూ ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటానని ఒకసారి అవకాశం కల్పించి రాబోవు కాలంలో వార్డును అభివృద్ధి చేసుకోవాలని ఓటర్లను కోరారు. ఒక సేవకురాలుగా ప్రజలకు అందుబాటులో ఉంటానని హామీ ఇచ్చారు. 15 సంవత్సరాల నుండి వార్డు లో ఎటువంటి అభివృద్ధి చేయకుండా ఎప్పుడు ప్రజలను మభ్యపెడుతు మళ్ళీ ఓట్ల కోసం వస్తున్నారని వారిని నమ్మి ప్రజలు మోసపోవద్దని కోరారు.ఆమె వెంట 14 వ వార్డు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు

Leave a Reply