14 people | మావోయిస్టులు మృతి

14 people | చర్ల, ఆంధ్రప్రభ : మావోయిస్టు పార్టీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీ పీఎల్జీఏ బెటాలియన్ 1 కమాండర్ డీజీపీ ఎదుట లొంగిపోతున్న క్రమంలో ఛత్తీస్ గ‌ఢ్ మరోమారు తుపాకుల మోతతో దద్దరిల్లింది. సుక్మా, కొంటా, కిష్టారం అడవుల్లో పోలీసు బలగాలకు, మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు చోటుచేసుకున్నాయి.

వీరిని కొంటా ఏరియా కమిటీ సభ్యులుగా పోలీసులు గుర్తించారు. ఏరియా కార్యదర్శి సచిన్ మంగూ కూడా ఉన్నట్లు సమాచారం. మృతి చెందిన వారిలో కొంటా ఏఎస్పీ ఆకాష్ రావు గిరిపుంజను హత్య చేసిన మావోయిస్టులు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. దక్షణ బస్తార్ ప్రాంతంలో మావోయిస్టుల సంచారం ఉందన్న సమాచారంతో సుకుమా ఎస్పీ కిరణ్ చవాన్ ఆధ్వర్యంలో డీఆర్జీ బలగాలు కూంబింగ్ చేపట్టింది. ఈ క్రమంలో శనివారం తెల్లవారుజాము నుండి ఎదురు కాల్పులు చోటుచేసుకున్నాయి. ఎన్కౌంటర్ జరిగిన ప్రాంతంలో 14మంది మావోయిస్టుల మృతదేహాలతో పాటు మూడు ఏకే 47 రైఫిల్స్ లభించినట్లు భద్రత బలగాలు తెలిపాయి.

Leave a Reply