రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఇప్పటికే 2025 సంవత్సరానికి సంబంధించిన బ్యాంకు సెలవుల పూర్తి జాబితాను విడుదల చేసింది. దీని ప్రకారం మార్చి నెలలో మొత్తం 14 రోజుల పాటు బ్యాంకులు మూతపడనున్నాయి.
అయితే, ఈ సెలవుల జాబితాలోని కొన్ని సెలవులు అన్ని రాష్ట్రాలకు వర్తిస్తుండగా.. కొన్ని సెలవులు మాత్రం కొన్ని రాష్ట్రాలకే వర్తిస్తాయని బ్యాంక్ కస్టమర్లు గుర్తుంచుకోవాలి.
బ్యాంకు సెలవుల జాబితాను దృష్టిలో ఉంచుకుని, బ్యాంకు ఖాతాదారులు తమ బ్యాంకు పనులకు సంబంధించిన ప్రణాళికలను రూపొందించుకోవడం మంచిది. అయితే సెలవు రోజుల్లో బ్యాంకులు మూతపడినప్పటికీ ఆన్‌లైన్ సేవలు యథావిధిగా పనిచేస్తాయి… అలాగే, బ్యాంకు ఎటిఎంలు, నగదు డిపాజిట్ యంత్రాలు సెలవు దినాలలో ప్రజలకు అందుబాటులో ఉంటాయి.
మార్చి నెల బ్యాంకు సెలవుల పూర్తి జాబితా
- మార్చి 02 : ఆదివారం
- మార్చి 07 : చాప్చార్ కుట్ (ఈశాన్య రాష్ట్రాలలోని బ్యాంకులకి సెలవు)
- మార్చి 08 : రెండవ శనివారం
- మార్చి 09 : ఆదివారం
- మార్చి 13 : హోలీకా దహన్ (డెహ్రాడూన్, రాంచి, కాన్పూర్, లక్నో లోని బ్యాంకులకి సెలవు)
- మార్చి 14 :హోలీ పండుగ (దేశంలోని పలు రాష్ట్రాలలోని బ్యాంకులకి సెలవు)
- మార్చి 15 : హోలీ పండుగ (అగర్తలా, భువనేశ్వర్, ఇంపాల్ లోని బ్యాంకులకి సెలవు)
- మార్చి 16 : ఆదివారం
- మార్చి 22 : నాలుగవ శనివారం
- మార్చి 23 : ఆదివారం
- మార్చి 27 : షబ్-ఐ-ఖదర్ (జమ్మూ, శ్రీనగర్ లోని బ్యాంకులకి సెలవు)
- మార్చి 28 : జుమాత్-ఉల్-విదా (జమ్మూ, శ్రీనగర్ లోని బ్యాంకులకి సెలవు)
- మార్చి 30 : ఆదివారం
- మార్చి 31 : రంజాన్ పండుగ (దేశంలోని పలు రాష్ట్రాలలోని బ్యాంకులకి సెలవు)