13thAprilCartoon | ఆంధ్రప్రభలో నేటి కార్టూన్ ఔరా

13thAprilCartoon | ఆంధ్రప్రభలో నేటి కార్టూన్ ఔరా

13thAprilCartoon | ఎన్నికల వేడి.. హామీల హోరు
మేనిఫెస్టోల అసలు రూపం మారిందా?
గ్యారెంటీల రాజకీయ ప్రభావం
డబుల్ గ్యారెంటీల కొత్త ట్రెండ్
అమలు పై అనుమానాల మబ్బు
కార్టూన్‌లో రాజకీయ వాస్తవం

13thAprilCartoon
13thAprilCartoon

13thAprilCartoon | పోటాపోటీ మేనిఫెస్టోలు-తీర్చేనా ప్రజల ఆశలు

13thAprilCartoon | ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : ఎండల వేడికి తోడు ఎన్నికల వేడి కూడా రాజుకుంది. తిట్లూ ఆరోపణలూ, ప్రత్యారోపణలతో ఎన్నికలున్న రాష్ట్రాలన్నీ దద్దరిల్లి పోతున్నాయి. మేనిఫెస్టోలంటే ఒకప్పుడు ఆయా పార్టీల దార్శనికతకు అద్దం పట్టేవి. కానీ ఇప్పుడు అలా కాదు. ఓట్లను రాబట్టుకునేందుకు పార్టీలు వేసే గాలాల్లాగే ఉంటున్నాయి. వాటిలో అన్నీ ఉచితాలు, ఆకర్షణలు, వేరేపార్టీల వారిని దెబ్బకొట్టే ఆయుధాలే కనిపిస్తున్నాయి.

ఇప్పుడంతా ఆరు గ్యారెంటీల కాలం నడుస్తోంది. ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనూ అవే ఆరు గ్యారెంటీలు కాంగ్రెస్-కూటమి ప్రభుత్వాలను అధికారంలోకి తెచ్చాయి. బహుశ అందుకేనేమో బెంగాల్ ఎన్నికల్లో కూడా బీజేపీ అదే విధంగా ఆరు గ్యారెంటీల ప్రయోగానికి తెరతీసింది. కానీ అందులో అన్నీ దీదీ ప్రభుత్వాన్ని దెబ్బకొట్టేవే ఉన్నాయని అక్కడి టాక్.

ఏదేమైనప్పటికీ, ఈ గ్యారెంటీలు అధికారంలోకొచ్చాక నెరవేరుస్తారా, లేదా? లేదా ఎంత కాలానికి నెరవేరుస్తారన్న గ్యారెంటీ లేదు, ఉండదు. ఎందుకంటే, వాటిలోని సాధ్యాసాధ్యాల స్వరూపం పూర్తిగా ఎవ్వరికీ తెలీదు. ఆర్థికంగా రాష్ట్ర ఖజానా పరిస్థితి తెలీదు. అప్పులు-ఆదాయం సంగతి తెలీదు. మరి ఇవన్నీ తెలీకుండా గ్యారంటీలెలా?

సరే ఇవన్నీ పక్కన పెడితే ఇప్పూదు గ్యారెంటీల సంఖ్య మాత్రమే ఓటర్ల మనసుల్లో బలంగా నాటుకుంటుందేమోనని మిగతా పార్టీల ఆందోళన. అందుకే బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీకి ఆ పార్టీ నేత బీజేపీ కి డబుల్ గ్యారెంటీలు మనం ఇద్దామా అని సూచిస్తున్న కార్టూన్ ఇది.

ఇందులో అనాలోచిత, ఆకర్షిత మేనిఫెస్టోలపై పార్టీలు ఎంత శ్రద్ధ చూపుతున్నాయనేది చక్కగా ఎలివేట్ అవుతోంది. ఆంధ్రప్రభ కార్టూన్ ఇది. గత రెండు దశాబ్దాలుగా ఆంధ్రప్రభ పాఠకులను, కార్టూన్ ఇష్టులను అలరిస్తోన్న కార్టూన్ శీర్షిక- ఔరా.

Leave a Reply