మీ కష్టాల్లో తోడుగా ఉంటా!

మీ కష్టాల్లో తోడుగా ఉంటా!
- నన్ను దీవించండి…సేవకుడిగా పనిచేస్తాను
- అభివృద్ధి లక్ష్యంగా ఉత్తమ వార్డుగా తీర్చిదిద్దుతాను
- సీసీ రోడ్లు, డ్రైనేజీ సమస్యలకు శాశ్వత పరిష్కారం
- విద్యుత్ స్తంభాలు, లైన్ల సమస్యల పరిష్కారం
- అర్హులందరికీ పింఛన్లు, సంక్షేమ పథకాలు
- అన్ని కులాలకు సమాన అభివృద్ధే లక్ష్యం
- బ్యాట్ గుర్తు సీరియల్ నెంబర్ 6కు ఓటు వేసి గెలిపించండి
- వార్డులో ముమ్మర ప్రచారం
- 13వ వార్డు స్వతంత్ర అభ్యర్థి జీడీ రామచంద్రం
స్టేషన్ ఘన్ పూర్, ఆంధ్రప్రభ : స్టేషన్‌ఘన్‌పూర్ మున్సిపాలిటీ పరిధిలోని 13వ వార్డులో స్వతంత్ర అభ్యర్థి జీడీ రామచంద్రం పోటీ చేస్తున్నారు. అభ్యర్థి ముమ్మరంగా ప్రచారం నిర్వహిస్తూ ప్రజల్లో విశేష ఆదరణ పొందుతున్నారు. ఈ సందర్బంగా ఓటర్లను 13వార్డ్ సీరియల్ నెంబర్ 6 బ్యాట్ గుర్తుకు ఓటు వేసి కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని అభ్యర్థి విజ్ఞప్తి చేశారు. ప్రచా రంలో భాగంగా అభ్యర్థి ప్రజలకు కీలక హామీలు ఇస్తూ వార్డు అభి వృద్ధికి స్పష్టమైన దిశను చూపిస్తున్నారు. 10వ తరగతి విద్యార్థులకు రూ.5వేల ఆర్థిక సహాయం అందిస్తామని తెలిపారు. వార్డులో ఎవరు మరణించినా కుటుంబానికి 50 కిలోల బియ్యంతో పాటు రూ.5వేల ఆర్థిక సహాయం అందజేస్తామని హామీ ఇచ్చారు.
వింతతులు, అర్హులైన వారికి పింఛన్లు మంజూరు అయ్యేలా కృషి చేస్తామని చెప్పారు. వార్డు లో ఉన్న సీసీ రోడ్లు, డ్రైనేజీ సమస్యలను పూర్తిగా పరిష్కరిస్తాను. అన్ని కులాలకు కమ్యూనిటీ హాల్ నిర్మాణం, విద్యుత్ స్తంభాలు, లైన్ల సమస్యలను పూర్తిగా సరి చేస్తామని హామీ ఇచ్చారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ పింఛన్లు వచ్చేలా కృషి చేస్తానని, ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులందరికీ అందేలా ప్రత్యేక చర్యలు తీసుకుంటామని తెలిపారు. అన్ని కులాలకు సమాన అభివృద్ధే తన లక్ష్యమని పేర్కొన్నారు. అభ్యర్థి మాటలకు ప్రజల నుంచి అపూర్వ స్పందన లభిస్తుండటంతో, వార్డులో గెలుపు ఖాయం అన్న అభిప్రాయం బలంగా వినిపిస్తోంది. ప్రచారంలో ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొంటూ మద్దతు తెలుపుతున్నారు. అనంత రం ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగుతానని అభ్యర్థి రామ చంద్రం స్పష్టం చేశారు.
