మృతురాలికి నివాళులు..

మృతురాలికి నివాళులు..
పరకాల, ఆంధ్రప్రభ : పట్టణంలో అకాల మరణం చెందిన మృతురాలి పార్థివ దేహానికి కాంగ్రెస్ నాయకులు నివాళులర్పించారు. పరకాల మున్సిపల్ పరిధిలోని 13 వ వార్డు కాంగ్రెస్ పార్టీ నాయకుడు బొచ్చు మహేందర్ గ మాతృమూర్తి బొచ్చు ఐలమ్మ అకాల మరణం చెందారు. ఆదివారం రోజు మధ్యాహ్నం బొచ్చు ఐలమ్మ పార్దివదేహాన్ని పరకాల పట్టణ కాంగ్రెస్ పార్టీ సమన్వయ కమిటీ సభ్యులు మడికొండ సంపత్ కుమార్, మడికొండ శ్రీను సందర్శించి పూలమాలలువేసి, నివాళులు అర్పించారు. ఐలమ్మ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు బొచ్చు జితేందర్, మడికొండ సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.
