లోక కళ్యాణార్థం

130 మంది జంటలు
శ్రీ లక్ష్మీ గణపతి హోమ పూజలు
గుడివాడ – ఆంధ్రప్రభ: గుడివాడ పట్టణం మెయిన్ రోడ్డులోని శ్రీ విఘ్నేశ్వర దేవాలయంలో సంకటహర చతుర్దశి పర్వదినాన్ని పురస్కరించుకొని ఆదివారం దేవస్థాన మండపంలో శ్రీ లక్ష్మీ గణపతి హోమ పూజలు ఘనంగా జరిగాయి.130 మంది జంటలు పీటలపై కూర్చొని పూజలు చేశారు. శ్రీ సంకటహర చతుర్దశి పర్వదినం మరియు పవిత్ర కార్తీక మాసాన్ని పురస్కరించుకొని లోక కళ్యాణార్థం దేవాలయంలో లక్ష్మీ గణపతి హోమ పూజలు నిర్వహించినట్లు దేవస్థానం ధర్మకర్తల కమిటీ చైర్మన్ శాయన రాజేష్, ఈవో యార్లగడ్డ వాసు తెలిపారు. హోమ పూజల్లో దేవస్థాన కమిటీ సభ్యులు , లోయ వాసు, పంచుమర్తి శ్రీనివాసరావు, రమణమూర్తి, పోతురాజు, వీరమాచినేని శైలజ, విజయలక్ష్మి, శారద, దుర్గ భవాని, గణపతి శాస్త్రి, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
