మీ ఇంటి ఆడబిడ్డగా ఆదరించండి ఆశీర్వదించండి…

మేడ్చల్, ఆంధ్రప్రభ : ఎల్లంపేట మున్సిపాలిటీ పరిధిలోని డబిల్ పూర్ పట్టణంలో 12 వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి దుడ్డు స్వప్న ప్రవీణ్ కుమార్ నేను డిగ్రీ చదువుకున్న విద్యావంతురాలిని కావడం తో సమాజం పట్ల అవగాహన కలిగి ఉంది . 12 వ వార్డు ప్రజలకు సేవ చేసే భాగ్యం కల్పించాలి.. వార్డు లో ఉన్న ప్రతి సమస్య పై అవగాహన కల్గి వున్నాను.. ఆశతో కాదు ఆశయం కోసం పనిచేసే వారికి అవకాశం ఇవ్వండి. ఆశతో గెలిచిన వాళ్ళు ఆదాయం కోసం చూస్తారు, కానీ ఆశయంతో గెలిచిన వాళ్ళు వార్డు అభివృద్ధి కోసం పని చేస్తారు. 24 గంటలు అందుబాటులో ఉంటాను నిత్యం ప్రజా సమస్యలను పరిష్కరిస్తూ మన స్థానిక ఎంపీ ఈటెల రాజేందర్ సహకారంతో వార్డు అభివృద్ధికి కృషి చేస్తానని, మీ అందరిలో ఒక్కరినైనా నేను మీ ఆశీర్వాదం కోసం మీ ముందుకు వస్తున్న మీ ఇంటి ఆడబిడ్డగా ఆదరించండి ఆశీర్వదించండి… కమలం గుర్తుకు ఓటు వోట్ వేసి మీకు సేవ చేసే భాగ్యం కల్పించాలి అని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను.
