12th ward | ప్రతి గల్లీ, ప్రతి ఓటరు….

12th ward | ప్రతి గల్లీ, ప్రతి ఓటరు….
- 12 వార్డులో బీజేపీ అభ్యర్థి ఇంటింటి ప్రచారం
12th ward | పరకాల, ఆంధ్రప్రభ : పట్టణంలోని 12వ వార్డులో బిజెపి అభ్యర్థి ఆకుల లావణ్య శ్రీధర్ జోరుగా ప్రచారం నిర్వహించారు. ఈ రోజు పరకాల పట్టణంలోని 12వ వార్డులో ఇంటింటి ప్రచారంలో భాగంగా బీజేపీ అభ్యర్థి ఆకుల లావణ్య శ్రీధర్ ప్రతి గల్లీ ప్రతి ఓటరు బీజేపీ వైపు ఉండాలని, బీజేపీ అభ్యర్థులను అధిక మెజార్టీతో గెలిపించాలని జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఓటర్లతో మాట్లాడుతూ వార్డు సమస్యలు తెలుసుకొని శాశ్వత పరిష్కారానికి కృషి చేస్తానని అభ్యర్థి లావణ్య శ్రీధర్ హామీ ఇవ్వడం జరిగింది. ముచ్చటిస్తూ మా విజయానికి మీ సహకారం ఉండాలని వారి యొక్క ఆశీర్వాదాలు తీసుకుంటూ ఇంటింటికి తిరిగి ప్రచారాన్ని చేయడం జరిగింది. ఈ ప్రచారంలో అభ్యర్థి వెంట బీజేపీ నాయకులు పిట్ట కిషోర్, దంచనాల కిరణ్, లక్కం శ్రీను, మెంతుల స్వప్న, పిట్ట లావణ్య, రాజేందర్, కిరణ్, మధు, అనిల్ తదితర నాయకులు పాల్గొనడం జరిగింది.
