12 autos | బోధన్ బల్దియాలో చెత్త సేకరణకు కొత్త ఆటోలు..

12 autos | బోధన్ బల్దియాలో చెత్త సేకరణకు కొత్త ఆటోలు..

12 autos | బోధన్, ఆంధ్రప్రభ : బోధన్ మున్సిపాలిటీలో చెత్త సేకరణ కోసం పది నూతన ఆటోల(New cars)ను కొనుగోలు చేశారు. 38వార్డు లలో చెత్త సేకరణకు 28ఆటోలు వినియోగిస్తున్నారు. ప్రతి రోజు 28నుంచి 34 టన్నుల చెత్త వస్తుంది. వీటి సేకరణకు వినియోగించే వాహనాలలో ప్రస్తుతం 8ఆటోలు చెడిపోయాయి.

ప్రస్తుతం 12ఆటోలు(12 autos) మాత్రమే చెత్త సేకరణకు వినియోగిస్తున్నారు. వాహనాలు తగినన్ని లేకపోవడంతో ఉదయం, సాయంత్రం రెండు సార్లు చెత్త సేకరిస్తున్నారు.వాటి స్థానం లో కొత్త ఆటోలను కొనుగోలు చేశారు. ఎన్నికల కోడ్ అనంతరణ వీటిని ప్రారంభిoచడానికి మునిసిపల్ అధికారులు(municipal officials) ఏర్పాట్లు చేస్తున్నారు.

Leave a Reply