ఆదరించండి అభివృద్ధి చేసి చూపిస్తా…

ఆదరించండి అభివృద్ధి చేసి చూపిస్తా…

  • 11వ వార్డ్ కాంగ్రెస్ అభ్యర్థి సూరం చంద్ర మౌళి

లక్షేట్టిపేట, ఆంధ్రప్రభ : మున్సిపల్ ఎన్నికల్లో 11వ వార్డ్ ప్రజలు ఆదరించి ఓటు వేసి గెలిపించి, అభివృద్ధికి సహకరించాలని కాంగ్రెస్ అభ్యర్థి సూరం చంద్రమౌళి ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. శుక్రవారం ఉదయం 11వ వార్డ్ లో నాయకులతో కలిసి ప్రచారం నిర్వహించారు. వార్డ్ లో నెలకొన్న సమస్యలను ఎమ్మెల్యే సహకారంతో అధిక నిధులు సమాకూర్చి ఖచ్చితంగా పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఇంటింటికి తిరిగి గతంలో పోటీ చేసి ఓడిపోయినప్పటికీ మళ్ళీ ఈ సారి ప్రజల ఆశీర్వాదాలు ఉంటాయనే ధీమాతో 11 వ వార్డ్ అభివృద్ధి కోసం బరిలో ఉన్నానని తెలిపారు.వార్డ్ లో డ్రైనేజ్, వీధి దీపాలు, రోడ్ల నిర్మాణాలే కాకుండా అర్హులైన వారికి ఇందిరమ్మ ఇల్లు వచ్చేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

ప్రభుత్వం ఇప్పటికే అనేక సంక్షేమ పథకాలతో అన్ని వర్గాల ప్రజలకు అండగా ఉంటుందని తెలిపారు.మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఉచిత 200 యూనిట్స్ కరెంటు, రైతు భరోసా, పెన్షన్స్ ఇస్తూ అండగా ఉంటుందని వివరించారు. ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు హయాంలో మున్సిపాలిటీ అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతుందని, కాంగ్రెస్ చేయి గుర్తు కు ఓటు వేసి భారీ మెజారిటీ తో గెలిపించాలని ఓటర్లను కోరారు. 11వ వార్డ్ ను ఇతర వార్డ్ లకు ఆదర్శం గా అభివృద్ధి చేసి చూపుతానన్నారు. ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండి సేవలందిస్తానని తెలిపారు. ఈ ప్రచారంలో కాంగ్రెస్ నాయకులు పడాల కాంతయ్య, వెన్న వెంకటస్వామి, గోపే అశోక్, పోతారాజుల శీను, తిరుపతి, మహేష్, ఎంబడి అశోక్ కుమార్, రామగిరి సత్తయ్య, సంపత్ రెడ్డి, పల్లికొండ శంకర్, సూరం మహేష్, రమేష్, తోట శీను, సురేష్, మల్లేష్, రవి, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply