మరోసారి అవకాశం ఇవ్వండి మిగిలిన సమస్యలను పరిష్కరిస్తాను

మరోసారి అవకాశం ఇవ్వండి మిగిలిన సమస్యలను పరిష్కరిస్తాను
బిజెపి కౌన్సిలర్ అభ్యర్థి శ్రీధర్ బాబు
చౌటుప్పల్, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపాలిటీలోని 11 వార్డులో మరోసారి తనను కౌన్సిలర్ గా గెలిపించాలని కోరుతూ వార్డు బిజెపి కౌన్సిలర్ అభ్యర్థి పొలోజు శ్రీధర్ బాబు కోరారు. ఎన్నికల ప్రచారం చివరి రోజున శ్రీధర్ బాబు వార్డులోని ప్రతి గల్లీకి, ప్రతి ఇంటికి వెళ్లి గతంలో కౌన్సిలర్ గా తాను చేసిన అభివృద్ధి పనులను, ప్రధాని మోడీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వ అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను వివరిస్తూ ఓట్లను అభ్యర్థించారు. మరోసారి తనను కౌన్సిలర్ గా గెలిపించాలని, వార్డులో మిగిలిపోయిన అన్ని సమస్యలను పరిష్కరిస్తానని శ్రీధర్ బాబు తెలిపారు. కౌన్సిలర్ గా మరోసారి గెలిపిస్తే మీకు సేవకుడిగా పని చేస్తానని, మీకు సేవ చేసే అవకాశాన్ని మరోసారి కల్పించాలని శ్రీధర్ బాబు ఓటర్లను కోరారు. ప్రచార కార్యక్రమంలో బిజెపి మున్సిపల్ అధ్యక్షురాలు కడారి కల్పన ఐలయ్య యాదవ్, నాయకులు ముత్యాల భూపాల్ రెడ్డి, గుజ్జుల సురేందర్ రెడ్డి, ఊడుగు వెంకటేశం, కడారి ఐలయ్య యాదవ్, గోశిక పురుషోత్తం తదితర నాయకులు, మహిళలు పాల్గొన్నారు. కాగా 11వ వార్డు కౌన్సిలర్ గా శ్రీధర్ బాబు యే మరోసారి విజయం సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
