గెలుపు బాటలో 11 వార్డు బిజెపి అభ్యర్థి జయశ్రీ చిన్న కొండయ్య

గెలుపు బాటలో 11 వార్డు బిజెపి అభ్యర్థి జయశ్రీ చిన్న కొండయ్య
11వ వార్డు లో ముమ్మరంగా ఇంటింటి ప్రచారం
రైటప్: మద్దతు ఇవ్వాలని ఓటర్ను కోరుతున్న 11వ వార్డు బిజెపి అభ్యర్థి జయశ్రీ చిన్న కొండయ్య
మక్తల్ , ఫిబ్రవరి 7 (ఆంధ్రప్రభ) : మక్తల్ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మ 11వ వార్డు బిజెపి అభ్యర్థి గా బరిలో ఉన్న జయశ్రీ చిన్న కొండయ్య ప్రచారం గెలుపు బాటలో సాగుతోంది. శనివారం వార్డులో ప్రజల నుంచి అపూర్వ స్పందన లభించింది. ఇంటింటికి వెళ్లి ఓటర్ల దగ్గరికి వెళ్లి తనకు మద్దతు ఇవ్వాలని కోరారు పక్కా ప్రణాళికతో 11వ వార్డు అభివృద్ధి చేయడమే తన లక్ష్యమని అన్నారు .అందరి ఆలోచనల మేరకు అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామన్నారు. వార్డులో ప్రధానంగా డ్రైనేజీ సిసి రోడ్ల నిర్మాణం చేపడతామని అన్నారు. అదేవిధంగా తాగునీటి సమస్య పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. మున్సిపాలిటీల అభివృద్ధి కేంద్రం నిధులతోనే సాధ్యమని అన్నారు. కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం స్థానికంగా పాలమూరు పార్లమెంటు సభ్యులుగా డీకే అరుణమ్మ సహకారంతో భారీ ఎత్తున నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేస్తామని చెప్పారు. 11వ వార్డు పరిధిలోని ప్రతి గల్లీలో సీసీ రోడ్లు డ్రైనేజీల నిర్మాణం చేపడతామన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను అర్హులందరికీ అందించేలా కృషి చేయడమే తన ధ్యేయమని అన్నారు. ఈ ప్రాంత అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్న తనను ఆదరించి ఆశీర్వదించి ఈ నెల 11న జరగనున్న ఎన్నికల్లో కమలం గుర్తుకు ఓటు వేసి తనను 11వ వార్డు కౌన్సిలర్ గా గెలిపించాలని జయశ్రీ చిన్న కొండయ్య విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు జయానందన్ రెడ్డి,బి. కురుమయ్య,దండు వెంకటయ్య, నీలవర్ధన్ రెడ్డి, చెన్నారెడ్డి, నరసింహారెడ్డి ,శ్యామయ్య,మనోహర్, ఆంజనేయులు ,గోవిందు,గుడీసె మనోహర్ తదితరులతో పాటు పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు.
