ఏకైక మాజీ కౌన్సిలర్ పోటీ… ఓటమి

ఏకైక మాజీ కౌన్సిలర్ పోటీ… ఓటమి
- 11 మంది మాజీ కౌన్సిలర్లు పోటీకి దూరం.
మోత్కూర్, ఆంధ్రప్రభ : మోత్కూర్ మున్సిపాలిటీ లో గత పాలకవర్గం లో పనిచేసిన 12 మంది మాజీ కౌన్సిలర్లు కాస్త… ఈ దఫా ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్నారు. మున్సిపల్ చైర్మన్ ఎస్సి మహిళకు రిజర్వ్ కావడం, రిజర్వేషన్లు అనుకూలించకపోవడం,ఆయా పార్టీలలో టికెట్లు ఇవ్వకపోవడం, ఆర్ధిక భారం, పలు కారణాలతో దాదాపు గా 11 మంది కౌన్సిలర్లు పోటీకి పూర్తి దూరంగా ఉన్నారు. కానీ 5 వ వార్డ్ మాజీ కౌన్సిలర్ మలిపెద్ది రజిత మాత్రం …ఆ వార్డులో కాంగ్రెస్ పార్టీ పొత్తులో భాగంగా సీపీఐ అభ్యర్థి మొగుళ్ళ స్వాతి కి సీటు ఇవ్వడం తో…రజిత స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగగా …179 ఓట్లు పోలవ్వగా..అక్కడ మరో స్వతంత్ర అభ్యర్థి మొగుళ్ళ అనురాధ గెలుపొందడం తో…రజిత ఓటమి పాలయ్యారు.దీంతో ఈ సారి మున్సిపల్ పాలకవర్గంలో పాత వారికి చోటు దక్కలేదని చెప్పొచ్చు.
