10th exame| పది పరీక్షలు ప్రారంభం

పది పరీక్షలు ప్రారంభం
ఆంధ్రప్రభ వెబ్‌డెస్క్ : రాష్ట్రవ్యాప్తంగా పదో తరగతి పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. ఉదయం 8 గంటలకే విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు చేరుకున్నారు. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పరీక్షలు జరగనున్నాయి. నేటి నుంచి ఏప్రిల్ 16 వరకు పరీక్షలు కొనసాగనున్నాయి. పదో తరగతి పరీక్షల నేపథ్యంలో చీఫ్ సూపరిండెంట్లు, డిపార్ట్మెంట్ ఆఫీసర్లు, అడిషనల్ డిపార్టమెంట్ ఆఫీసర్లు, ఫ్లయింగ్ స్క్వాడ్లలతో పాటు సిట్టింగ్ స్క్వాడ్లు పరీక్ష కేంద్రాల్లో తనిఖీ చేయనున్నారు.
ఎగ్జామ్ సెంటర్లో అధికారులు మౌలిక వసతులు ఏర్పాటు చేశారు. విద్యార్థుల కోసం కేంద్రాల్లో నీరు, విద్యుత్ సౌకర్యాలను ఏర్పాటు చేశారు. పరీక్ష సమయంలో విద్యార్థులు అస్వస్థతకు గురైతే తక్షణమే చికిత్స అందించేందుకు ప్రతీ కేంద్రం వద్ద ప్రథమ చికిత్స కేంద్రాలను ఏర్పాటు చేశారు. సీసీ కెమెరాల పర్యవేక్షణలో విద్యార్థులు పరీక్షలు జరుగుతున్నాయి. పోలీసుల బందోబస్తు ఏర్పాటు చేసి బిఎన్ఎస్ఎస్ 163 చట్టాన్ని అమలు చేశారు. కేంద్రాల్లో మాస్ కాపీయింగ్ జరగకుండా స్క్వాడ్‌తో తనిఖీలు నిర్వహించారు.
