108 vehicle | ఉపాధ్యాయురాలిపై ఆటో డ్రైవర్ కత్తి తో దాడి

108 vehicle | ఉపాధ్యాయురాలిపై ఆటో డ్రైవర్ కత్తి తో దాడి

  • డ్రైవర్ చేతిలోని కత్తి లాక్కొని ఎదురుదాడికి దిగిన డైనమిక్ ఉపాధ్యాయురాలు హరిత
  • మెడలో బంగారు కోసమే కత్తితో దాడి చేశాడా..?
  • మరి ఏమైనా కారణాలు ఉన్నాయా అనే కోణంలో పోలీసులు విచారణ
  • మెడలో బంగారు గొలుసు లాక్కొని పరారైన ఆటో డ్రైవర్
  • గంటల వ్యవధిలోనే ఆటో డ్రైవర్ను అదుపులోకి తీసుకున్న పోలీసులు

108 vehicle | గూడూరు, ఆంధ్రప్రభ : ప్రభుత్వ ఉపాధ్యాయురాలిపై ఆటో డ్రైవర్ విచక్షణారహితంగా కత్తితో దాడికి పాల్పడి మెడలో ఉన్న బంగారు గొలుసు తీసుకొని పరారైన సంఘటన గూడూరు రూరల్ పరిధిలోని చెమిర్తి సమీపంలో ఉన్న తిరుపతి గారి పల్లి గ్రామం వద్ద గురువారం చోటుచేసుకుంది. రూరల్ పోలీసుల సమాచారం మేరకు ఒకటో పట్టణంలోని వాటర్ ట్యాంక్ వద్ద పండిట్ హరిత బాలయ్య పల్లి మండలం గొట్టిపాడు గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో విధులు నిర్వహించేందుకు కోడివాక వెంకటరమణ అనే వ్యక్తి ప్యాసింజర్ ఆటో ఎక్కింది.

మార్గమధ్యంలో ఆమెతోపాటు మరో ఇద్దరు ప్రయాణికులు అదే వాహనంలో ఎక్కి చెన్నూరు వద్ద ఒకరు మరో ప్రాంతంలో ఒకరు వాహనం నుండి దిగేశారు. ఈ క్రమంలో చెమిర్తి గ్రామం దాటి సమీపంలో ఆటో మరమ్మత్తులకు గురైందని ఆటో నుండి దిగి ఆటోను పరిశీలిస్తున్నట్టు నాటకమాడుతూ ఒక్కసారిగా తన వద్దనున్న కత్తితో మహిళ ఉపాధ్యాయురాలు హరితపై దాడి చేసి రెండుసార్లు కత్తితో ఆమని పొడవడమే కాకుండా గొంతుపై కూడా గాయపరిచి ఆమె మెడలో ఉన్న బంగారు గొలుసు లాగే ప్రయత్నం చేశాడు.

అదే సమయంలో భయానికి లోనవ్వకుండా ఉపాధ్యాయురాలు ఎంతో ధైర్య సాహసాలతో ఆటో డ్రైవర్ చేతిలో ఉన్న కత్తిని లాక్కొని ఎదురుదాడికి దిగింది. అయినప్పటికీ ఆమె బలం సరిపోకపోవడంతో మెడలో ఉన్న బంగారు గొలుసు లాక్కుని ఆమెను ఆటో నుండి రోడ్డుపై తోసేసి పరారయ్యాడు. కొద్దిసేపటి తర్వాత ఇది గమనించిన గ్రామస్తులు వెంటనే 108 వాహనానికి రూరల్ పోలీసులకు సమాచారం అందించారు. రక్తపు మడుగులో కొట్టుకుంటున్న ఉపాధ్యాయురాలు హరితను స్థానికుల సహకారంతో 108 వాహనం ద్వారా గూడూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు వైద్య చికిత్స అందిస్తూ మెరుగైన వైద్యం కోసం నెల్లూరుకు హరితను తరలించారు.

ఆటో డ్రైవర్ వెంకటరమణ చెన్నూరు వద్ద ఉన్న కట్టాలమ్మ ఆలయం వద్ద ఆటో వదిలేసి పరారవుతున్న సమయంలో రూరల్ పోలీసులు ఎంతో చాకచక్యంగా అతనిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు రూరల్ పోలీసులు వెల్లడించారు.

Leave a Reply