అత్యవసర వైద్య సేవలలో ముందుండాలి..

ఉట్నూర్, ఆంధ్రప్రభ : ఏజెన్సీ గిరిజన ప్రాంతాల ప్రజలకు అత్యవసర వైద్య సేవలు అందించడంలో 108 ఉద్యోగులు ముందుండాలని ఆదిలాబాద్ జిల్లా 108 మేనేజర్ సూరం శేఖర్ రెడ్డి ఉద్యోగులకు కోరారు. ఆయన ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ లో అంబులెన్స్ లను ఆకస్మిక తనిఖీ చేసి రికార్డులను, వాహన నిర్వహణను పరిశీలించారు. అనంతరం ఆస్పత్రులకు చేర్చి బాధితులకు వైద్య సేవలు అందించేలా చూడాలన్నారు. విధుల పట్ల నిర్లక్ష్యం చేయకూడదని కాల్ వచ్చిన వెంటనే ఆ ప్రాంతానికి వెళ్లి అత్యవసర పరిస్థితుల్లో ఉన్నవారికి వైద్య సేవలు అందేలా కృషి చేయాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఉట్నూర్ 108 అంబులెన్స్ ఈఎంటి కుంబోజి దత్తాత్రేయ, పైలట్ మార్కపు రవీందర్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
