100 pumpkins | ధరలు పెరిగినా, బంగారం ఎలా సొంతం చేసుకోవచ్చు?

100 pumpkins |తెనాలి రామలింగడి అద్భుతమైన తెలివి.
గుమ్మడికాయల కథలో దాగిన జీవన సూత్రం.
బంగారం సామాన్యులకు ఎందుకు అందని ద్రాక్ష అయింది?
రామలింగడి ఫార్ములా: చిన్న సేవింగ్స్‌, పెద్ద ఫలితం.
గోల్డ్ కార్డులు, నెలవారీ పొదుపు ప్రయోజనాలు.
తెలివిగా ఆలోచిస్తే బంగారం కల కాదు.

100 pumpkins | ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : ఒకసారి శ్రీకృష్ణ దేవరాయల వారికి ఒక బుద్ధి పుట్టింది. అదేమిటంటే, వంద మంది బ్రాహ్మణులకు ఒక్కో గుమ్మడి కాయ దానం చెయ్యాలని. కానీ, బ్రాహ్మలందరూ తాము దానంగా పుచ్చుకున్న గుమ్మడికాయలను అక్కడే ఆరగించెయ్యాలి… కొంతమంది మంత్రులను పిలిచి తన ఆలోచన చెప్పారు. దానమివ్వడం వరకు బానే ఉంది గానీ, మళ్ళీ ఈ తిరకాసేమిటోనని మంత్రులందరూ గుసగుసలాడుకున్నారు.

100 pumpkins |
100 pumpkins |

దానం పుచ్చుకోవడానికి బ్రాహ్మలకేం కొదువ? వెంటనే పిలిపించొచ్చు కానీ, దానమిచ్చిన గుమ్మడి కాయలను అక్కడికక్కడే ఆరగించెయ్యమంటేనే…వాళ్ళు వస్తారో, రారో… రారని చెప్పినా, వచ్చిన వాళ్ళు అక్కడికక్కడే గుమ్మడి కాయలను తినలేక పోయినా రాయల వారితో చిక్కు…పోనీ అలా తినలేరని చెబుదామన్నా చిక్కే. నాకామాత్రం తెలీదా అని ప్రభువుల వారు ఎక్కడ ఆగ్రహిస్తారోనని…ఈలోగా వారికి తెనాలి రామలింగడు కనిపించాడు. వీళ్ళ దగ్గరకు వచ్చి, “ఏమిటో మంత్రులంతా కలిసి దీర్ఘంగా ఆలోచిస్తున్నారు?” అని ప్రశ్నించాడు. మంత్రులంతా రాయలవారి ఆలోచన తెలిపారు. రామలింగడు నవ్వేసి, “అలాగే బ్రాహ్మలందరిని పిలిపించి దానమిప్పించేద్దాం” అన్నాడు.

రాయలవారి ఆలోచన రామలింగడు సరిగ్గా వినలేదేమో అనుకుని మంత్రులంతా మరో మారు గుమ్మడికాయలు అక్కడే తినడం గురించి చెప్పారు. అయినా రామలింగడేం కంగారు పడకుండా, తేలిగ్గా “అదెంత పని? అలాగే తినిపించేద్దాం!…అదంతా నేను చూసుకుంటాను” అని అభయమిచ్చాడు… రామలింగడు అలా అన్నాడంటే అతడి మనసులో ఏదో చమత్కారమైన పరిష్కారం ఉండే ఉంటుందన్న ధైర్యంతో దానాలకు అన్ని ఏర్పాట్లూ పూర్తి చేసారు. రాయల వారు వచ్చారు..ఒక్కొక్కరికీ గుమ్మడి కాయలను దానాలిచ్చేసారు. అసలు తంతు మొదలైంది…అందరి ఆసక్తీ దానిపైనే.

రామలింగడు దానం తీసుకున్న బ్రాహ్మలందరినీ వరుసగా కూర్చోబెట్టాడు. వారి దగ్గరి నుండి గుమ్మడి కాయలు తీసుకుని ఒకచోట పేర్చాడు. అందులోంచి ఒక్క కాయని మాత్రమే ముక్కలుగా కోయించి, పక్కనే పొయ్యి ఏర్పాటు చేయించి చక్కగా కూర వండించాడు. అది వందమందికి వడ్డించే సరికి తలో ముక్కా వచ్చింది…ఎవరికీ సరిపోలేదు. అటు వడ్డన పూర్తయ్యాక…మరో కాయ తీసుకుని ముక్కలు చేసి మళ్ళీ కూర వండడం…ఈ చివర నుండి వడ్డన మొదలెట్టడం….ఇలా ఒకటీ…రెండూ…మూడూ…వంద కాయలు పూర్తయ్యాయి…రాయల వారి కోరిక నెరవేరింది.

వంద మంది బ్రాహ్మలు వంద గుమ్మడి కాయలు అక్కడికక్కడే తినడం అయింది… లెక్క సరిపోయింది…అందరూ రామలింగడి అద్భుతమైన ఆలోచనని మెచ్చుకున్నారు. దీనికీ బంగారానికీ లింకేమిటనుకుంటున్నారా? అసలు కథ ఇక్కడే ప్రారంభం…. రోజురోజుకీ కొండలూ గుట్టలూ ఎక్కడం అయిపోయి ఏకంగా ఆకాశంలోకి పరిగెత్తుతున్న బంగారం సామాన్యులకు దూరమై చాలా రోజులైంది. తులం బంగారం ఎంత అని అడిగే ధైర్యం, కొనే ఆలోచన సామాన్యులకు రావడం లేదు.

100 pumpkins |
100 pumpkins |

అలాగని బంగారంపై ఇన్నాళ్ళూ పెంచుకున్న మోజు పోదుకదా? ఇలాంటి సందర్భంలో రామలింగడి ఫార్ములా అద్భుతంగా పనిచేస్తుంది. బంగారమన్నాక తులమే కొనాలా? నెలకింత కొంటే? ఏదాదికి ఎంత అవుతుంది? చాలా బంగారం షాపులవాళ్ళు గోల్డ్ కార్డులిస్తున్నారు. నెలకింత అందులో జమచేస్తే ఏడాదికి ఎంతో కొంత బంగారం సొంతం చేసుకోవచ్చు…లేదా నెలకింత ఎంతో కొంత వేరేగా సేవ్ చేసుకున్నా, కొన్ని నెలలకు ఆ అమౌంట్ తీసి కొంక్కుంటే కొంత బంగారం సొంతమవుతుంది.

ఇకపై కిలోలకొద్దీ, తులాలకొద్దీ బంగారం కొనడం సామాన్యులకు కలే. కనుక అందని ద్రాక్ష లాంటి బంగారాన్ని అందిపుచ్చుకోవాలంటే తెనాలి రామలింగడి తెలివొక్కటే శరణ్యం.

click here to read more

click here to read 24k gold | ధరలు రికార్డు స్థాయిలో.. ఇప్పుడే కొనాలా? పెళ్లిళ్ల సీజన్ ముందు నిపుణుల కీలక విశ్లేషణ

Leave a Reply