ఇంటర్ పరీక్షల్లో 100 శాతం ఉత్తీర్ణత

చిట్యాల, ఆంధ్రప్రభ : ఇంటర్మీడియట్ పరీక్షల ఫలితాలలో మండల కేంద్రంలోని టీజీ ఎస్ డబ్ల్యూ ఆర్ ఎస్ బాలికల కళాశాల గురుకుల బాలికలు ఉత్తమ ప్రతిభ కనబరిచారని , ప్రిన్సిపాల్ గోల్కొండ బిక్షపతి ఆదివారం తెలిపారు . వెలుగులోఇంటర్ ప్రధమ ద్వితీయ సంవత్సరం విద్యార్థులు పరీక్షల్లో 100 శాతం ఉత్తీర్ణత సాధించినట్లు బిక్షపతి తెలిపారు. బైపీసీలో ద్వితీయ సంవత్సరంలో బి మణిదీపిక ,969/1000, కే భార్గవి , 950/1000, ఎంపీసీ ద్వితీయ సంవత్సరంలో కే ఐశ్వర్య, 964/1000 , ఆర్ అనుష , 960/1000, సాధించినట్లు తెలిపారు. ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను ప్రిన్సిపాల్ గోల్కొండ బిక్షపతి, ఉపాధ్యాయ బృందం , విద్యార్థులు, అభినందించారు.

Leave a Reply