100 Crores | నల్లమల్ల టూరిజం అభివృద్ధికి రూ.వంద కోట్లు
- సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపిన ఎమ్మెల్యే వంశీకృష్ణ
100 Crores | అచ్చంపేట, ఆంధ్రప్రభ : నల్లమల్ల టూరిజం అభివృద్ధికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రూ.100 కోట్లు కేటాయించుటకు ప్రతిపాదనలకు అధికారులకు ఉత్తర్వులు జారీ చేసినందుకు నల్లమల్ల ప్రాంత ప్రజల తరఫున సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానని, నల్లమల ప్రాంత ప్రజలు ఆయనకు రుణపడి ఉంటారని టీపీసీసీ ఉపాధ్యక్షులు, అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ శనివారం తెలిపారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 2025 మే 19న నాగర్‌కర్నూల్ జిల్లా, అమ్రాబాద్ మండలం, మాచారం గ్రామంలో “ఇందిర సౌర గిరి జల వికాసం” పథకాన్ని ప్రారంభ కార్యక్రమానికి విచ్చేసిన సందర్భంగా నల్లమల్ల ప్రాంతాన్ని టూరిజం హబ్ గా అభివృద్ధి పరిచేందుకు కోరిన నేపథ్యంలో స్పందించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే నల్లమల ప్రాంతంలో ఉన్నటువంటి శ్రీ ఉమామహేశ్వరం, మద్దిమడుగు దేవస్థానాలతో పాటు మల్లెల తీర్థం, వ్యూ పాయింట్ తదితర ప్రాంతాలను అభివృద్ధి చేయడానికి తెలంగాణ టూరిజం డెవలప్మెంట్ ఆధ్వర్యంలో రూ.100కోట్లను కేటాయించే ప్రతిపాదన సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి కార్యాలయం నుండి ప్రతిపాదన సర్కిల్ విడుదల చేయడం జరిగిందని, త్వరలోనే టూరిజం హబ్ కు సంబంధించి ప్రణాళిక టెండర్లు, నిధులు విడుదల వంటివి జరుగుతాయని ఎమ్మెల్యే తెలిపారు.


