10 people died | లోయలో పడిన బస్సు..

10 people died | లోయలో పడిన బస్సు..
10మంది మృతి, 32మందికి తీవ్రగాయాలు
10 people died | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : బస్సు లోయలో పడి 10మంది మృతిచెందిన విషాద ఘటన మెక్సికో (Mexico) లో జరిగింది. ఈ ప్రమాదంలో 10మంది మృతి చెందగా (10 people died), 32మందికి గాయాలయ్యాయి. అతి వేగంతో అదుపు తప్పి పక్కనే ఉన్న భారీ లోయలో పడటంతో ఈ ప్రమాదం జరిగింది.
స్థానికులు అందించిన సమాచారం మేరకు పోలీసులు అక్కడకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన 32 మందిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. క్రిస్మస్ పండగ సందర్భంగా జరిగిన ఈ ఘటన ఆ ప్రాంతంలో విషాదం నింపింది. అతి వేగంతో ప్రయాణించడం వల్లనే బస్సు అదుపు తప్పి లోయలో పడిందని పోలీసుల తెలిపారు.
