24K Gold| మళ్ళీ రెక్కలొచ్చి..పైపైకి…

24K Gold| మళ్ళీ రెక్కలొచ్చి..పైపైకి…

24K Gold| బంగారం ధరలకు రెక్క‌లు
స్థిరంగా సిల్వ‌ర్ రేటు
24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,61,570
కిలో వెండి ధర రూ.2.95 లక్షలు

24K Gold
24K Gold

బంగారం ధ‌ర‌లు ఎప్పుడు పెరుగుతాయో… ఏ రోజు త‌గ్గుతాయో తెలియ‌డం లేదు. ఇవాళ శుక్రవారం నమోదైన వివరాల ప్రకారం.. 24 క్యారెట్ల బంగారంపై రూ. 550 పెరగ్గా.. 22 క్యారట్ల బంగారంపై రూ. 500 పెరిగింది. ఈరోజు ఉదయం హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.550 పెరిగి రూ.1,61,570కి చేరుకుంది. అలాగే 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర కూడా 10 గ్రాములకు రూ.500 పెరిగి రూ.1,48,100 వద్ద ట్రేడ్ అవుతోంది. మరోవైపు వెండి ధర స్థిరంగా కొనసాగుతోంది. హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.2.95 లక్షలుగా ఉంది.

దేశంలోని ఇతర ప్రధాన నగరాల్లో కూడా పసిడి ధరలు పెరిగాయి. చెన్నైలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర అత్యధికంగా రూ.1,62,550గా ఉండగా, ఢిల్లీలో రూ.1,61,720గా ఉంది. ముంబై, కోల్‌కతా, బెంగళూరు నగరాల్లో హైదరాబాద్‌తో సమానంగా రూ.1,61,570 వద్ద కొనసాగుతోంది. ఇక వెండి విషయానికొస్తే, చెన్నైలో కిలో ధర రూ.2.95 లక్షలు పలుకుతుండగా, ముంబై, ఢిల్లీ, కోల్‌కతాలలో రూ.2.85 లక్షలుగా ఉంది.

24K Gold

Leave a Reply