1/70 law | సర్పంచ్ ఎన్నికల బహిష్కరణ…

1/70 law | సర్పంచ్ ఎన్నికల బహిష్కరణ…
1/70 law | దండేపల్లి, ఆంధ్రప్రభ : దండేపల్లి మండలంలోని గూడెం గ్రామా పంచాయతీ ఎన్నికలని ఈ సారి కూడా బహిస్కరిస్తున్నామని గ్రామస్తులు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గూడెం గ్రామాన్ని అప్పటి నాయకులు, అధికారులు వారి స్వభావాల కోసం 1920 నుండి సెన్సెస్ రికార్డులు(Census records) అలాగే రెవిన్యూ రికార్డుల్లో ఓటర్ లిస్టులు అన్యాయం చేశారని అన్నారు.
గ్రామంలో గిరిజనులు లేకున్నా ( 170 చట్టంలో) చేర్పించారని దాని వాళ్లు గత 38 సంవత్సరాలనుండి గూడెంలో సర్పంచ్ ఎన్నికలు జరగడం లేదు కాబట్టి చాలా సార్లు బహిస్కరిస్తూవస్తున్నామని అన్నారు. గిరిజనులు లేకపోవడంతో ఈ సారి కూడా నామినేషన్ లు వేయలేదని తెలియజేశారు.
గ్రామ ప్రజల అభిప్రాయం మేరకు (1/70 చట్టాన్ని)(1/70 law) రద్దు చేసి జనరల్ గ్రామ పంచాయతీగా మార్చాలని కోరుతూ ఇప్పటి సర్పంచి ఎన్నికలను బహిస్కరిస్తున్నామని తీర్మానించి తెలిపారు.
