మ|| స్వామి అయ్యప్ప పులివాహనారూఢా
వీరశాస్త్రకూ లోకశాస్త్రకూ జటాధరకూ
స్వామి అయ్యప్పకూ మహారూపకూ నీరాజనం||
అను|| శంకరీ చిత్తరంజనునకూ హాలహల
ధరసుతకూ అనంగ మదవాతురకూ పాశ
హస్తకూ స్వామి అయ్యప్పకూ నీరాజనం ||
చ|| కల్పాహరకు సుమప్రియకు వివిదార్ధ
ఫలప్రదకూ శివోత్సాహకూ శైవశాస్త్ర
ప్రచారకూ శాపని గ్రహకూ పంచాక్షర
పరాయణకూ జటాధరనునకు స్వామి అయ్యప్పకు నీరాజనం||
చ|| పద్దెనిమిది మెట్లకు పంపానదికీ శబరిమలకు
జటాధరునకు స్వామి అయ్యప్పకూ నీరాజనం||