శ్రీ రాఘవేంద్రుడి ఆదాయం

( మంత్రాలయం, ఆంధ్రప్రభ): ప్రసిద్ధి పుణ్య క్షేత్రం మంత్రాలయం శ్రీ రాఘవేంద్రస్వామి మఠం హుండీలో రూ. 3,35,31,756లు ఆదాయం వచ్చినట్లు శ్రీ రాఘవేంద్ర స్వామి మఠం మేనేజర్ ఎస్కే శ్రీనివాసరావు బుధవారం తెలిపారు. ఆగష్టు నెలలో 22 రోజుల హుండి లెక్కింపును నిర్వహించారు. భక్తులు కానుక రూపంలో సమర్పించిన హుండీ ఆదాయం కరెన్సీ 3,24,52,256, నాణేలు రూ.10,79,500లు బంగారం (74 గ్రాములు), వెండి 1440 గ్రాములు వచ్చినట్లు మేనేజర్ తెలిపారు.

Leave a Reply