భక్తులు ప్రత్యేక పూజలు
వరంగల్ సిటీ బ్యూరో, ఆంధ్రప్రభ : దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఓరుగల్లు భద్రకాళీ మాత గాయత్రి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు.

అమ్మవారికి ఉదయం 5 గంటల నుండే భక్తులు ప్రత్యేక పూజలు చేస్తున్నారు. అమ్మవారిని దర్శించుకోవడానికి అధిక సంఖ్యలో భక్తులు రావడంతో ఆలయం కిటకిటలాడుతోంది.