ఎవరో వస్తారని… ఏదో చేస్తారనీ…
జైనూర్, ఆంధ్రప్రభ : వర్షాకాలంలో కురిసిన భారీ వర్షాల వల్ల మట్టి రోడ్డు(dirt road) అద్వానంగా మారడంతో ప్రజలు అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. ఎవరో వస్తారని ఏదో చేస్తారని చూడకుండా తాటిగూడ గ్రామస్తులే ముందుకు వచ్చి రోడ్డు మరమ్మతు(road repair)కు శ్రీకారం చుట్టారు. గ్రామస్తులు రోడ్డుకు గుంతలు ఉన్నచోట మట్టి వేసి మరమ్మత్తు పనులు చేశారు.
మండలంలోని చింతకర్ల మండలంలోని చింతకర్ర పంచాయతీలోగల చింతకర్ర, కిషన్ నాయక్ తండా(Chintakarra, Kishan Nayak Thanda), తాడిగూడ, గిరిజన గ్రామాలను కలిపే మట్టి రోడ్డు గుంతల మయంగా మారడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బంది కలిగింది. దీంతో గ్రామ ప్రజలు ఏకమై సుమారు మూడు కిలోమీటర్ల మేర(three kilometers long) గుంతలు పడ్డ రోడ్డు మరమ్మత్తు పనులకు శ్రమదానంతో మరమ్మత్తు పనులు ప్రారంభించారు.
రోడ్డుకిరువైపులా పెరిగిన చెట్ల కొమ్మలను తొలగించి, మట్టి వేసి రోడ్డును సరిచేశారు. చీర మీద ఘాట్ ప్రాంతంలోని ప్రధాన బీటి రోడ్డు నుండి చింతకర్ర కిషన్ నాయక్ తండ వరకు, కేరమేరి ఘాట్(Kerameri Ghat) ప్రాంతంలోని ప్రధాన బీటి రోడ్డు నుండి చింతకర్ర కిషన్ నాయక్ తండ వరకు 2017లో ఈ రహదారికి 220.50 కోట్ల రూపాయలతో బీటీ రోడ్డు నిర్మాణానికి నిధులు కూడా మంజూరయ్యాయి.
ప్రతి వర్షాకాలంలో ఆ గ్రామాలకు ఉన్న మట్టి రోడ్డు వర్షాలకు కొట్టుకుపోయి గుంతల మయంగా మారడం ఆ గ్రామాల ప్రజలు భయాందోళనకు గురికావడం, వాహనదారులు(motorists) ఇబ్బంది పడటం జరుగుతూనే ఉంది. ఏడాది కాలంగా ఆ గ్రామలకు వెళ్లే రోడ్డు అద్వానంగా మారినా అధికారులు, రాజకీయ నాయకులు ఎవరూ పట్టించుకోకపోవడంతో ఆ గ్రామస్తులే శ్రమదానాని(Shramadanani)కి శ్రీకారం చుట్టి పనులు ప్రారంభించారు.


