రాష్ట్రస్థాయి హ్యాండ్బాల్ పోటీలకు యుతీష్ ఎంపిక
దండెపల్లి, ఆంధ్రప్రభ : అండర్–19 ఎస్జీఎఫ్ రాష్ట్రస్థాయి హ్యాండ్బాల్ పోటీలకు దండెపల్లి మండలంలోని లింగాపూర్ ఆదర్శ పాఠశాలకు చెందిన విద్యార్థి బందెల యుతీష్ ఎంపికయ్యాడు.మంచిర్యాల జిల్లా కోటపల్లి మోడల్ స్కూల్లో నిర్వహించిన ఎస్జీఎఫ్ క్రీడా ఎంపిక పోటీల్లో యుతీష్ తన ప్రతిభను ప్రదర్శించి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యాడు.హ్యాండ్బాల్ క్రీడలో చురుకుదనం, ఆటతీరుతో ప్రతిభ కనబరిచిన యుతీష్ను పాఠశాల ఉపాధ్యాయులు అభినందించారు.
రాష్ట్రస్థాయి పోటీల్లోనూ అత్యుత్తమ ప్రతిభ కనబరిచి విజయం సాధించాలని ఆకాంక్షించారు. క్రీడలతో పాటు విద్యార్థులు చదువులోనూ రాణిస్తూ పాఠశాలకు మంచి పేరు తీసుకురావాలని ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపల్ రామగిరి రమేష్ పేర్కొన్నారు.విద్యార్థి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక కావడం పట్ల పాఠశాల పీడీ ముత్యం మహేందర్, ఉపాధ్యాయులు, విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు. యుతీష్ను అభినందించి, రాష్ట్రస్థాయి పోటీల్లో విజయవంతంగా రాణించాలని శుభాకాంక్షలు తెలిపారు.
