పోస్టల్ బ్యాలెట్ 11లో వైసీపీకి అధిక్యం
పలాస( శ్రీకాకుళం), ఆంధ్రప్రభ: పలాస కాశీబుగ్గ మున్సిపల్ ఎన్నికల్లో ఛైర్పర్సన్ అభ్యర్ధులకు 11 ఓట్లు పోలింగ్ జరగగా టీడీపీకి 2, వైసీపీకు 4 ఓట్లు రాగా మరో ఐదు ఓట్లు చెల్లని ఓట్లుగా అధికారులు గుర్తించారు. అలాగే వార్డు కౌన్సిలర్లుకు సంబంధించి ఒకటో వార్డు టీడీపీఅభ్యర్థి అశోక్ కుమార్ ఒకటి, మూడో వార్డు సవర రాంబాబు టీడీపీ ఒకటి, పదో వార్డు వైసీపీ అభ్యర్ధి గుజ్జు శైలజ ఒకటి, 12 వార్డు జనసేన ఎస్ ప్రదీప్ కుమార్ ఒకటి, 14 వార్డు వైసీపీ అభ్యర్ధి బెల్లాల శ్రీనివాసరావు ఒకటి, 21 వార్డు వైసీపీ అభ్యర్ధి సనపల సింహాచలం ఒకటి, 36 వార్డు టీడీపీ అభ్యర్థి ఉర్ణాన సునీత ఒకటి పోస్టల్ బ్యాలెట్ ఓట్లు వచ్చాయని ఎన్నికల అధికారులు తెలిపారు.
