చౌటుప్పల్‌లో ఘనంగా వైఎస్సార్‌ వర్ధంతి వేడుకలు

పేదల సంక్షేమానికి వైఎస్సార్‌ చేసిన సేవలు చిరస్మరణీయం.. కాంగ్రెస్‌ నాయకుల నివాళులు

చౌటుప్పల్, ఆంధ్రప్రభ : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి దివంగత డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి వర్ధంతి సందర్భంగా చౌటుప్పల్‌ పట్టణంలో కాంగ్రెస్‌ పార్టీ, రాజీవ్‌ స్మారక ట్రస్ట్‌ ఆధ్వర్యంలో బుధవారం నివాళులర్పించారు. లక్కారం గ్రామంలోని ఎమ్మెల్యే శిబిర కార్యాలయంలో కాంగ్రెస్‌ పార్టీ సమన్వయకర్త పబ్బు రాజుగౌడ్‌, వ్యవసాయ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ ఉబ్బు వెంకటయ్య, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ మొగుదాల పావని రమేష్‌గౌడ్‌ తదితరులు వైఎస్సార్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ వైఎస్సార్‌ పాలనను సంక్షేమ రంగానికి స్వర్ణయుగంగా అభివర్ణించారు. రాజీవ్‌ ఆరోగ్యశ్రీ, 104, 108 సేవలు, ఉచిత విద్యుత్‌, ఫీజు రీయింబర్స్‌మెంట్‌, పావలా వడ్డీ రుణాలు, ఇందిరమ్మ ఇళ్ల వంటి పథకాల ద్వారా పేదలు, బలహీన వర్గాలకు ప్రయోజనం కల్పించారని గుర్తుచేశారు. ప్రజల సంక్షేమం, అభివృద్ధికి వైఎస్సార్‌ చేసిన కృషి చిరస్మరణీయమని పేర్కొన్నారు.

కార్యక్రమంలో మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ గోశిక వినయ్‌, మార్కెట్‌ వైస్‌ చైర్మన్‌ ఆకుల ఇంద్రసేనారెడ్డి, నాయకులు వెలగ రాజశేఖర్‌రెడ్డి, బోయ దేవేందర్‌, కాసర్ల శ్రీనివాస్‌రెడ్డి, స్థానిక ప్రజాప్రతినిధులు, కౌన్సిలర్లు, కోఆప్షన్‌ సభ్యులు, కాంగ్రెస్‌ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

రాజీవ్‌ స్మారక భవనంలో నివాళులు

చౌటుప్పల్‌ పట్టణంలోని రాజీవ్‌ స్మారక భవనంలోనూ వైఎస్సార్‌ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. వైఎస్సార్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి నాయకులు నివాళులర్పించారు. ఆయన ప్రజలకు అందించిన సంక్షేమ కార్యక్రమాలను ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు.

ఈ కార్యక్రమంలో రాజీవ్‌ స్మారక ట్రస్ట్‌ ప్రధాన కార్యదర్శి ఎండీ ఖయ్యూం, నిర్వహణ కార్యదర్శి నల్ల నర్సింహ, ఐఎన్‌టీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోయ రామచందర్‌, నాయకులు లందగిరి భీమయ్య, ఆవుల యేసు, కంచర్ల జంగయ్య, మహమ్మద్‌ చాంద్‌ పాషా, ముత్యాల గణేష్‌, నిమ్మల ప్రభాకర్‌ తదితరులు పాల్గొన్నారు.