ఆదోనిలో వైఎస్సార్‌కు ఘన నివాళి
మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్‌రెడ్డి ఆధ్వర్యంలో భారీ మోటార్ సైకిల్ ర్యాలీ
ఆదోని, ఆంధ్రప్రభ : మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి వర్ధంతి సందర్భంగా ఆదోనిలో వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు ఘన నివాళులర్పించారు. మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్‌రెడ్డి ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయం నుంచి వైఎస్సార్ విగ్రహం వరకు భారీ మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించారు.
అనంతరం వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా నాయకులు, కార్యకర్తలు వైఎస్సార్ సేవలను స్మరించుకున్నారు. ఆయన చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలను గుర్తు చేసుకున్నారు. కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
