యువ‌కుడి ఆత్మ‌హ‌త్య‌

యువ‌కుడి ఆత్మ‌హ‌త్య‌

దండేపల్లి, ఆంధ్రప్రభ : టూర్‌కు వెళ‌తానంటే తండ్రి డ‌బ్బులు ఇవ్వ‌లేద‌ని ఓ యువ‌కుడు ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు. దండేపల్లి(Dandepally) మండలం గుడిరేవు గ్రామానికి చెందిన చిట్ల అన్వేష్(Chitla Anvesh) (22) అనే యువకుడు ఈ నెల 11న టూరు వెళ్తానని ఇంట్లో తన తండ్రి చిట్ల రాజిరెడ్డిని డ‌బ్బులు అడిగాడు. తండ్రి డ‌బ్బులు ఇవ్వ‌డానికి నిరాక‌రించాడు.

ఇందుకు ఆ యువ‌కుడు మనస్థాపానికి చెంది గ్రామ శివారులోని పోచమ్మ టెంపుల్ వెనుక పురుగుల మందు తాగి సెల్ఫీ వీడియో స్టేటస్‌(Selfie Video Status)లో పెట్టడంతో అన్వేష్ స్నేహితులు చూసి ఆయ‌న తండ్రికి చెప్పారు. అప్ర‌మ‌త‌మైన తండ్రి చికిత్స నిమిత్తం లక్షేట్టిపేట ప్రభుత్వ ఆసుపత్రి తరలించారు.

పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం కరీంనగర్(Karimnagar)లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. అక్కడ పరిస్థితి మరింత విషమించడంతో ఎల్లారెడ్డిపేటలోని ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. ఆ యువ‌కుడు చికిత్స పొందుతూ ఈరోజు తెల్లవారుజామున మృతి చెందినట్లు డాక్టర్లు నిర్ధారించారు. తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వెల్లడించారు.

Leave a Reply