కోదాడలో బీఆర్ఎస్‌లోకి యువత చేరిక
కండువాలు కప్పి ఆహ్వానించిన మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్
కోదాడ, ఆంధ్రప్రభ: కోదాడ పట్టణంలోని 18వ వార్డుకు చెందిన పలువురు యువకులు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ సమక్షంలో వినయ్, మీసాల నాని, రాము, సతీష్, వేణు, మణికంఠ, రాకేష్, పవన్, నవీన్ తదితరులు వివిధ పార్టీలను వీడి బీఆర్ఎస్ కండువాలు కప్పుకున్నారు.
ఈ సందర్భంగా బొల్లం మల్లయ్య యాదవ్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాల వల్ల గ్రామ, మండల స్థాయిలో ఆ పార్టీ విశ్వసనీయత కోల్పోతోందని విమర్శించారు. కేసీఆర్ పదేళ్ల పాలనలో తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించిందని, రైతులు, పేదలు, మహిళలు, యువతకు బీఆర్ఎస్ అండగా నిలిచిందని పేర్కొన్నారు. ప్రస్తుతం అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలకు నిధుల కేటాయింపు నిలిచిపోయే పరిస్థితి ఏర్పడిందని ఆరోపించారు. రానున్న ఖమ్మం-నల్గొండ-వరంగల్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో యువత ఉత్సాహంగా పాల్గొని బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి విజయానికి కృషి చేయాలని ఆయన కోరారు.
