సోకిలేరు వ్యూ పాయింట్ వద్ద యువకుడు గల్లంతు

చింతూరు, ఆంధ్రప్రభ : సోకిలేరు వ్యూ పాయింట్ వద్ద యువకుడు గల్లంతయిన ఘటన సోమవారం జరిగింది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. పశ్చిమగోదావరి జిల్లా భీమవరం మండలం చిన్న పేట గ్రామానికి చెందిన బుంగ బాలవందనం అనే యువకుడు పోలవరం జిల్లా చింతూరు ఏజెన్సీలోని చింతూరు మండలం తులసి పాక గ్రామానికి 4 కిలోమీటర్లు దూరంలోని Strategy వ్యూ పాయింట్ వద్ద సోకిలేరు వాగులో దిగి గల్లంతయ్యాడు. విహారయాత్ర కోసం సుమారు 20 మందికి పైగా ఒక బస్సు మాట్లాడుకుని చింతూరు ఏజెన్సీకి వచ్చారు.

ఈ క్రమంలో నలుగురు యువకులు వాగులో దిగి స్థానాలు చేస్తుండగా ఒక అబ్బాయి నీటిలో మునుగుతుండగా అతని కాపాడే ప్రయత్నంలో బాలవందనం వాగులో గల్లంతయ్యాడు. ఈ విషయం తెలుసుకున్న తెలుసుకున్న పోలవరం ఓఎస్డి జవాలీ ఆల్ఫోన్స్, చింతూరు సిఐ గోపాలకృష్ణ, ఎస్సై నాసిర్ హుస్సేన్ పోలీస్ సిబ్బందితో కలిసి వాగులో గల్లంతయిన వ్యక్తి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది