యువకుడు మృతి
కరీమాబాద్, అక్టోబర్ 28 (ఆంధ్రప్రభ) : ఖిలా వరంగల్ (Warangal) తూర్పు కోట ప్రాంతంలో సోమవారం రాత్రి జరిగిన ఘర్షణ దారుణానికీ దారితీసింది. స్నేహితుల మధ్య, మద్యం మత్తులో తలెత్తిన తగవులో, తూర్పు కోటకు చెందిన కుమారస్వామి రజిత దంపతుల కుమారుడు సాయి(23) అనే యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు.
స్నేహితులు సాయిని ఒంటరి చేసి కర్రలతో దాడి చేయగా తీవ్ర గాయాలతో రోడ్డుపై పడిపోయాడు.సహచరులు అతడిని చికిత్స కోసం ఎంజీఎం ఆసుపత్రి (MGM Hospital)కి తరలించారు. వైద్యులు పరీక్షించి సాయి అప్పటికే మృతి చెందాడని తెలిపారు..ప్రమాద ఘటనపై సమాచారం అందుకున్న మిల్స్ కాలనీ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. సిఐ రమేష్ మాట్లాడుతూ. ఘర్షణకు కారణాలపై దర్యాప్తు కొనసాగుతోందనీ తెలిపారు.

