Wajedu | పిడుగుపాటుతో యువకుడి మృతి.. పరామర్శించిన కాంగ్రెస్ నాయకులు

వాజేడు, జులై 24 (ఆంధ్రప్రభ) : ములుగు జిల్లా (Mulugu District) వాజేడు మండల పరిధిలోని పేరూరు గ్రామానికి చెందిన తోటపల్లి వేణు (Thotapalli Venu) (20) పిడుగుపాటుకు గురై బుధవారం మృతిచెందాడు. వారి కుటుంబాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి కాకర్లపూడి విక్రాంత్ (Kakarlapudi Vikrant) ఆధ్వర్యంలో పరామర్శించారు. దహన సంస్కరణల నిమిత్తం ఐదువేల రూపాయలు అందించడమే గాక ప్రభుత్వం నుండి వచ్చే అన్ని అవకాశాలను అందించేందుకు తమ వంతు కృషి చేస్తానన్నారు.

అదేవిధంగా మృతిచెందిన వేణు తల్లిదండ్రులతో భద్రాచలం నియోజకవర్గం ఎమ్మెల్యే తెల్లం వెంకటరావు(MLA Tellam Venkata Rao) తో ఫోన్ లో మాట్లాడించారు. భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకటరావు మృతిచెందిన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలుపుతూ తమ కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటానని హామీ ఇవ్వడం జరిగింది. ఈకార్యక్రమంలో వాజేడు నాగారం మాజీ సర్పంచ్ తల్లడి ఆదినారాయణ, వాజేడు మండలం యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు గౌరారపు కోటేశ్వరరావు, కాంగ్రెస్ నాయకులు చెన్నం ఎల్లయ్య, నలగాసి రమేష్, అరికెల రఘుపతి, తిప్పనపల్లి సూరిబాబు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply