విద్యుత్ షాక్‌తో యువకుడి బలి
కడెం, ఆంధ్రప్రభ : నిర్మల్ జిల్లా కడెం మండలంలోని కొండుకూర్(Kondukur) గ్రామంలో ఈ రోజు విద్యుద్ఘాతానికి సంఘం రాజేందర్ (35) అనే యువకుడు బలయ్యాడు. మండలంలోని కొండూకూర్ కు చెందిన సంఘం రాజేందర్ ఈ రోజు ఉదయం పొద్దుటూరి(Podduturi) సంజీవరెడ్డి(Sanjeeva Reddy) పొలంలో గడ్డి కోయడానికి వెళ్లి విద్యుత్ మోటర్‌తో గడ్డి కోస్తుండగా కరెంట్ షాక్(electric shock)కు గురై అక్కడికక్కడే మృతి చెందాడు.
మృతి చెందిన ఆయనకు భార్య, ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. గ్రామంలో కూలి పని చేసుకుంటూ కుటుంబ పోషణ(nutrition) కొనసాగిస్తున్నరాజేందర్ కరెంట్ షాక్‌తో మృతి చెందడంతో వారి కుటుంబ సభ్యులు రోదనల(crying)తో విషాదఛాయలు అలుముకున్నాయి.

