AP | మెడికల్ ప్రైవేటీకరణకు వ్యతిరేకం

AP | మెడికల్ ప్రైవేటీకరణకు వ్యతిరేకం

వైసీపీ భారీ ర్యాలీ!
భవిష్యత్తు కోసం ప్రజా ఉద్యమం చేయాలి – వైసీపీ ఇంచార్జీ రాజీవ్ రెడ్డి


ఎమ్మిగనూరు టౌన్, ఆంధ్రప్రభ : కూటమి ప్రభుత్వం గత ప్రభుత్వంలో మంజూరు అయిన మెడికల్ కళాశాలల ప్రయివేటీకరణకు ప్రజావ్యతిరేకంగా అఖిల పక్షాల, వైసీపీ ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీ (rally) చేపట్టారు. బుధవారం చేపట్టిన ఈ ర్యాలీ మాజీ ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి స్వగృహం నుండి ప్రారంభమై పెద్ద పార్కు, స్టేట్ బ్యాంక్, వైయస్ ఆర్ సర్కిల్, సోమప్ప సర్కిల్ మీదుగా తహశీల్దార్ కార్యాలయం వరకు సాగింది.

ఈ సందర్భంగా వైసీపీ (YCP) నియోజకవర్గ సమన్వయకర్త రాజీవ్ రెడ్డి, పార్లమెంట్ కార్యదర్శి ఎర్రకోట జగన్ మోహన్ రెడ్డి, విద్యార్థి సంఘాల నాయకులు మాట్లాడుతూ గత ప్రభుత్వం పేద,మధ్య తరగతి ప్రజల సంక్షేమం కాంక్షిస్తూ వ్యవసాయం, విద్య, వైద్య రంగాల్లో అనూహ్యమైన పథకాలు రూపొందించిన ఘనుడు వైయస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. అందులో భాగంగా రాష్ట్ర చరిత్రలో నిలచి పోయేలా 17 మెడికల్ కళాశాలలకు అనుమతులు తెచ్చి ఐదింటిని పూర్తి చేశారన్నారు. తక్కినవి వివిధ నిర్మాణ దశల్లో ఉండగా కూటమి ప్రభుత్వం అధికారం లోకి రాగానే పిపిపి పేరుతో ప్రయివేటీకరణకు పూనుకూన్నారని దీనిని వ్యతిరేకిస్తూ వైసీపీ అధినేత ఇచ్చిన పిలుపు మేరకు కోటి సంతకాల సేకరణ ప్రజా ఉద్యమం పేరుతో తమ నిరసనను తెలిజేస్తున్నామన్నారు.

ఈ ఉద్యమం ప్రజావ్యతిరేక ఉద్యమంగా మారిందన్నారు. కూటమి నిర్ణయం వెనక్కి తీసుకుని తక్షణమే మెడికల్ కళాశాలల (Medical Colleges) నిర్మాణం పూర్తి చేసి ప్రజలకు వైద్యం, వైద్య విద్యార్థులకు వైద్య విద్య అందుబాటులో తేవాలని, లేని పక్షంలో ఈ ప్రజా ఉద్యమాన్ని మరింత ఉదృతంగా కొనసాగిస్తామన్నారు. ప్రజా సమస్యలపై వైసీపీ, తమ కుటుంబం ముందుండి పోరాటం చేస్తామన్నారు. అనంతరం రెవెన్యూ అధికారులకు వినతిపత్రం అందజేశారు.

ఈకార్యక్రమంలో మునిసిపల్ ఛైర్మన్ (Municipal Chairman) డాక్టర్ కె. యస్ రఘు, పట్టణ అధ్యక్షులు కామర్తి నాగేషప్ప, రైతు విభాగం రాష్ట్ర అధికార ప్రతినిధి గడ్డం నారాయణ రెడ్డి, నందవరం మండల కన్వీనర్ శివప్ప గౌడ్, ఎమ్మిగనూరు మండల కన్వీనర్ బి ఆర్ బసిరెడ్డి, గోనెగండ్ల మండల కన్వీనర్ కృష్ణా రెడ్డి, నాయకులు ప్రమోద్ కుమార్ రెడ్డి, కౌన్సిలర్లు బజారి, డిష్ కేశవ రెడ్డి, వెంకట రెడ్డి, వినయ్ కుమార్ రెడ్డి, అఖిలపక్షాల నాయకులు ఉదయ్ కుమార్, రాజేష్, సత్యన్న, బాలరాజు, నియోజకవర్గ నాయకులు కార్యకర్తలు, విద్యార్థులు పాల్గొన్నారు.

Leave a Reply