మళ్ళీ వచ్చేది వైసీపీ ప్రభుత్వమే..

మళ్ళీ వచ్చేది వైసీపీ ప్రభుత్వమే..

ఎన్టీఆర్ బ్యూరో, ఆంధ్రప్రభ : కూటమీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుండే రాజకీయంగా కక్ష తీర్చుకునే చర్యలు చేస్తుందని ఎన్టీఆర్ జిల్లా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దేవినేని అవినాష్ విమర్శించారు. వైఎస్సార్‌సీపీ(YSRCP) నాయకులను ఇబ్బంది పెట్టడమే కూటమి ప్రభుత్వ లక్ష్యం అని, అక్రమ అరెస్ట్‌లు, లేని కల్తీ మద్యాన్ని సృష్టించి అరెస్ట్‌లు చేస్తున్నారని ఆరోపించారు.

కూటమి ప్రభుత్వంలో రెడ్ బుక్ రాజ్యాంగాన్ని రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారని కూటమి ప్రభుత్వానికి గుణపాఠం చెప్పేడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. జోగి రమేష్(Jogi Ramesh) కుటుంబ సభ్యులకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు పార్టీ పూర్తిగా అండగా ఉంటుందన్నారు. చంద్రబాబు ప్రభుత్వం కేవలం వైసీపీ నాయకులు మీద కక్షలు తీర్చుకోవడానికి అధికారంలోకి వచ్చినట్టు ఉందని రాష్ట్ర ప్రజలు సైతం భావిస్తున్నట్లు తెలిపారు. కూటమి ప్రభుత్వం(coalition government) వైసీపీ చేస్తున్న ప్రజా పోరాటాలు చూసి కూటమి ప్రభుత్వ నాయకులకు భయం పట్టుకుందని అందుకే అరెస్టులతో భయపెట్టే ప్రయత్నాలు చేస్తున్నట్లు ఆరోపించారు.

కల్తీ మద్యం(adulterated liquor) కేసులో ఎటువంటి ఆధారాలు లేకుండా అక్రమంగా అరెస్ట్ లు చేస్తున్నారని, చంద్రబాబు ఆడుతున్న డ్రామా లను రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నట్లు తెలిపారు. కూటమి ప్రభుత్వం ఎన్ని కుట్రలు పన్నితే.. వైస్సార్సీపీ అంత బలపడుతుందని, అధికారం శాశ్వతం కాదన్న అయన మళ్ళీ వచ్చేది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే అన్న విషయాన్ని కూటమి నాయకులు గుర్తించుకోవాలన్నారు.

Leave a Reply