రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురి మృతి

విప్‌, ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు దిగ్భ్రాంతి..
మృతుల పార్థివదేహాలకు నివాళులు

విజయవాడ రూరల్‌ (వెస్ట్), ఆంధ్రప్రభ : విజయవాడ రూరల్‌ నున్న గ్రామానికి చెందిన కొమ్మారెడ్డి రాందేవ్‌, ఆయన తల్లి అరుణ, ఏడాది వయసున్న కుమారుడు మహాత్రు వెస్ట్‌ బైపాస్‌పై జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం పట్ల ఏపీ ప్రభుత్వ విప్‌, గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందడం తనను తీవ్రంగా కలచివేసిందని పేర్కొన్నారు.

మంగళవారం మధ్యాహ్నం మృతుల పార్థివదేహాలకు ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు పూలమాలలు వేసి నివాళులర్పించారు. వారి మృతికి ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. అనంతరం బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి తన సానుభూతిని తెలియజేశారు. ఈ విషాద సమయంలో కుటుంబ సభ్యులకు మనోధైర్యం కల్పించాలని భగవంతుడిని ప్రార్థించారు.