Yami Gautam |నెట్టింట వైరల్ అవుతున్న యామీ గౌతమ్ సంచలన పోస్ట్!
ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్: తన ఫోటోలను ఏఐతో మార్పిడి చేయవద్దంటూ బాలీవుడ్ నటి యామీ గౌతమ్ సోషల్ మీడియాలో చేసిన ఒక పోస్ట్ ప్రస్తుతం సినీ వర్గాల్లోనూ, నెట్టింటనూ హాట్ టాపిక్‌గా మారింది. ఇటీవలే ఉత్తమ నటిగా జాతీయ పురస్కారాన్ని అందుకున్న ఈ నటి మీడియాకు ఒక ప్రత్యేక విజ్ఞప్తి చేశారు. తాను పబ్లిక్ ఈవెంట్స్‌లో పాల్గొన్నప్పుడు తీసే ఫోటోలను ఏఐ (AI) టెక్నాలజీని ఉపయోగించి మార్చవద్దని, వాటిని ఎలాంటి ఎడిటింగ్ లేకుండా ఒరిజినల్ రూపంలోనే ప్రచురించాలని ఆమె కోరారు.
యామీ గౌతమ్ పోస్ట్‌లో ఏముందంటే?
తన అధికారిక ‘ఎక్స్’ (X) ఖాతాలో యామీ గౌతమ్ తన మనసులోని మాటలను ఇలా పంచుకున్నారు. “మీడియాకు నా మనవి.. దయచేసి నేను బయట ఈవెంట్స్‌లో పాల్గొన్నప్పుడు తీసిన ఫోటోలను ఎటువంటి మార్పులు లేకుండా.. ఏఐతో మార్చకుండా పోస్ట్ చేయాలి. ఒక వ్యక్తికి తెలియకుండా, వారి అనుమతి లేకుండా, ఏఐ (AI)ని ఉపయోగించి వారి ఫోటోలను మార్చడం, తారుమారు చేయడం సరికాదు. నా అభ్యర్థనను గౌరవించినందుకు ముందుగానే ధన్యవాదాలు!”ఈ విషయాన్ని నెటిజన్లు, ఆమె అభిమానులు సైతం సమర్థిస్తూ యామీకి మద్దతుగా నిలుస్తున్నారు.
ఏఐ టెక్నాలజీపై సెలబ్రిటీల ఆందోళనలు..
ప్రస్తుత డిజిటల్ యుగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఎంత వేగంగా అభివృద్ధి చెందుతుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కేవలం ఒక్క క్లిక్‌తో ఫోటోలను రీటచ్ చేయడం, ముఖాలను మార్చడం వంటివి సర్వసాధారణం అయిపోయాయి. అయితే, సెలబ్రిటీల అనుమతి లేకుండా వారి రూపాలను ఏఐ ద్వారా మార్చడం, సోషల్ మీడియాలో డీప్‌ఫేక్స్ లేదా ట్యాంపర్డ్ ఇమేజ్‌లను వైరల్ చేయడం వంటి పరిణామాలు ఇప్పుడు పెద్ద ఆందోళనగా మారాయి.

